అభిఘాతము


Contributors to Wikimedia projects

Article Images

భౌతిక శాస్త్రములో అభిఘాతమునకు ప్రాముఖ్యత ఉంది.ఒక సరళ రేఖపై ఒకే దిశలో లేక వ్యతిరేక దిశలో కదులుచున్న రెండు వస్తువులు ఒకదానిని మరొకటి ఢీకొంటె అభిఘాతము జరిగిందంటారు.[1]

ఒక వస్తువు విమానం ఉపరితలమును తగిలినప్పుడు విక్షేపణ జరుగుతుంది.

అభిఘాతాలు జరిపే వస్తువుల మధ్య బలాల అన్యోన్య చర్య వివిధ సంధర్భమములలో, వివిధ కారణములపై ఆధారపదుతుంది.రెండు బిలియర్డ్ బంతుల మధ్య బలాల అన్యోన్య చర్యకు కారణము స్థితిస్థాపకత.బిలియర్డ్ బంతులు భౌతికంగా ఒకదానిని ఒకటి తాకినప్పుడు మాత్రమే ఈ అన్యొన్య చర్య ఉంటుంది.భారగ్రస్థ కేంద్రము వలన, α-కణ పరిక్షేపణలో ఈ అన్యోన్య చర్యకు కారణము స్థిరవిద్యుత్ బలాలు.వాయు అణువుల మధ్య అభిఘాతము, అణుచలన సిద్ధాంతమును అభివృద్ధిపరచింది.అధికశక్తి గల కణములు పరమాణువులతో జరిపే అభిఘాతము కృత్రిమ పరివర్తనను కనుగొనుటకు ఉపయోగిస్తారు.[2] అభిఘాతములో పాల్గొన్నరెందు వస్తువుల వేగాలు, అభిఘాతనికి ముందు, తర్వాత ఒకే సరళరేఖపై వుండి, వ్యతిరేఖ దిశలలో వున్న ఆ అభిఘాతాన్ని సూటి అభిఘాతము అంటారు.వాటి వేగ దిశలు ఒకే సరళ రేఖపై లేకున్న ఆ అభిఘతాన్ని ఏటవాలు అభిఘతము అని అంటారూ అభిఘాతాలలో అభిఘాత వస్తువుల మొత్తము ద్రవ్యవేగము నిత్యత్వ నియమాన్ని అనుసరిస్తుంది.సాధారణముగా, మొత్తము గతిజ శక్తి నిత్యత్వ నియమాన్ని అనుసరించదు.

అభిఘాతములో కొంత శక్తి ఉష్ణశక్తి, కాంతిశక్తి, ధ్వని శక్తి రూపములోకి మారుతుంది.అటువంటి అభిఘాతాలను అస్థితిస్థపక అభిఘాతాలు అంటారు.మొత్తము గతిజశక్తి నిత్యత్వమైతే ఆ అభిఘతాన్ని స్థితిస్థాపక అభిఘాతము అంటారు.

ద్రవ్యవేగ నిత్యత్వము, గతిజశక్తి నిత్యత్వమును పాటించే అభిఘాతాన్ని స్థితిస్థపక అభిఘాతం అంటారు. ఉదాహరణ:పరమాణువులు, అణువులు, ప్రాథమిక కణాల మధ్య గల అభిఘాతము స్థితిస్థాపక అభిఘాతము.

ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని పాటించి, గతిజశక్తి యొక్క నియమాన్ని అనుసరించని అభిఘాతాన్ని అస్థితిస్తాపక అభిఘాతము అంటారు. ఉదాహరణ:1.గోదను ఢీకొన్న బంతి, వాహనాల వల్ల అభిఘాతము, రెండు వస్తువులు అభిఘాతము తర్వాత కలిసిపోతే, ఆ అభిఘాతము, పరిపూర్ణ అస్థితిస్థపక అభిఘాతము అంటారు.2చెక్కదిమ్మెలో పేల్చిన బుల్లెట్.

  1. http://billiards.colostate.edu/technical_proofs/TP_3-1.pdf
  2. భౌతిక శాస్త్రము (బి.యస్.సి మొదటి సంవత్సరము)