ఆచంట జానకిరాం


Contributors to Wikimedia projects

Article Images

ఆచంట జానకిరాం

ఆచంట జానకిరాం సుప్రసిద్ధ రేడియో ప్రసార ప్రముఖులు, రచయిత. చిత్రకారులు కూడ.

ఆచంట జానకిరాం
జననంఆచంట జానకిరాం
1903 జూన్ 16
మరణం1994
నివాస ప్రాంతంతిరుపతి
ఇతర పేర్లుఆచంట జానకీరాం
ప్రసిద్ధిసుప్రసిద్ధ రేడియో ప్రసార ప్రముఖులు, రచయిత. చిత్రకారులు కూడ.
తండ్రిఆచంట లక్ష్మీపతి
తల్లిఆచంట సీతమ్మ

జానకిరామ్‌ 1903 జూన్ 16న జన్మించారు. వీరు సుప్రసిద్ధ సంఘసేవకురాలు, ఆచంట సీతమ్మ, ఆచంట లక్ష్మీపతి కుమారులు. సీతమ్మ గారి మరణం తరువాత ఆచంట లక్ష్మీపతి గారు పెళ్లి చేసుకోవడం మూలాన డా. ఆచంట రుక్మిణమ్మ ఆయనకు పిన్నిగారు అయ్యారు. అవిభక్త మదరాసు రాష్ట్రంలో ఆరోగ్యశాఖా మంత్రిణి గా ఆమె పని చేసారు.

1938 జూన్ 16 న మదరాసులో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా ఆచంట జానకిరామ్‌ చేరారు. తొలి డైరక్టర్ జనరల్ లైనల్ ఫీల్డెన్ నియమించిన తొలి తరం వారిలో ఆచంట ఒకరు. సున్నితమైన మనస్సు, తెల్లని దుస్తులు ధరించి కార్యక్రమ రూపకల్పనలో మేటి అనిపించుకున్నారు జానకిరాం. మదరాసు కేంద్రం నుండి తొలి తెలుగు నాటకం ' అనార్కలి ' జానకిరాం ప్రయోక్తగా వెలువడింది. వాణి ఎడిటర్ గా మదరాసు కేంద్రంలో ఒక దశాబ్దిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరి సతీమణి ఆచంట శారదాదేవి పద్మావతీ మహిళా కళాశాల తెలుగు శాఖ అధ్యక్షురాలిగా పనిచేశారు. జానకిరాం తిరుపతిలో 1961 నుండి విశ్రాంత జీవనం గడిపి 1994లో (88 సంవత్సరాలు) తనువు చాలించారు..

  • జానకిరాం సున్నితమైన ఆధునిక చిత్రకళ లో ప్రావీణ్యం సంపాదించారు. 170కి పైగా స్వీయ చిత్రాలను ఆంధ్ర మహిళా సభకు బహూకరించారు.
  • అడయార్ లో బి.యస్.సి.ఆనర్సు చదివారు. అప్పుడు రవీంద్రనాధ్ ఠాగూర్ దాని చాన్సలర్. రవీంద్రనాథ్, అనీబిసెంటు, జేమ్స్ కజిన్స్ వీరిని ప్రోత్సహించారు.
  • కొంతకాలం ఢిల్లీలో దక్షిణ భారత ప్రసారాల విభాగంలో పనిచేశారు. తర్వాత తిరుచిరాపల్లి కేంద్రంలో ప్రాగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేసి మదరాసు చేరారు. 120 పైగా తమిళ నాటకాలు మిత్రుల సాయంతో ప్రసారం చేశారు. ఆంధ్రదేశం నలుమూలల నుండి పండితులను పిలిపించి తెలుగు ప్రసంగాలు ఏర్పాటు చేశారు. 21 సంవత్సరాలు ఆకాశవాణిలో ప్రముఖ పదవులు నిర్వహించారు.
  • వాణి పత్రిక సహాయ సంపాదకులుగా పనిచేశారు. ఢిల్లీ విదేశ ప్రసార విభాగంలో పనిచేసి 1959లో మదరాసు కేంద్రంలో ASDగా పదవీ విరమణ చేశారు. 1960 ఠాగూరు శతజయంతి సంఘ కార్యదర్శిగా పనిచేశారు. స్వర్ణపీఠ వీరి కావ్యం. చలం ఈ కావ్యం చదివి సంతోషించారు. వీరి జన్మదిన సందర్భంగా 1971లో ఆంధ్ర మహిళా సభ వారు Glimpses of Telugu Literature అనే వీరి రచనను ప్రచురించారు.
  1. నాస్మృతిపథంలో
  2. సాగుతున్న యాత్ర