ఉండుకము
Contributors to Wikimedia projects
Article Imagesఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది.
సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి.
ఉండుకము (Vermiform appendix) పేగులో ఒక భాగము. మానవులలో ఇది అవశేషావయవము. ఇది ఉదరములో కుడివైపు క్రిందిమూలలో పెద్ద ప్రేగు మొదటి భాగానికి కలిసి ఉంటుంది. అరుదుగా ఎడమవైపుకూడా ఉండవచ్చును. మనుషులలో ఉండుకము ఇంచుమించు 10 సె.మీ పొడుగుంటుంది (2-20 సె.మీ.). ఇది పేగుకు కలిసేభాగం స్థిరంగా ఉన్నా, దీనికొన ఉదరంలో ఏవైపుకైనా తిరిగి ఉండవచ్చు. దీని వాపునొప్పి ఈస్థానాన్ని బట్టి ఉంటుంది.
ఉండుకము | |
---|---|
Arteries of cecum and vermiform appendix. (Appendix visible at lower right, labeled as "vermiform process"). | |
Normal location of the appendix relative to other organs of the digestive system (frontal view). | |
లాటిన్ | appendix vermiformis |
గ్రే'స్ | subject #249 1178 |
అంగ వ్యవస్థ | జీర్ణ వ్యవస్థ |
Precursor | Midgut |
MeSH | Appendix |
Dorlands/Elsevier | a_54/12147735 |
- అపెండిసైటిస్ (Appendicitis) : అపెండిక్స్ లేదా ఉండుకము ఇన్ఫెక్షన్ వలన ఇది వాచిపోతే దానిని అపెండిసైటిస్ అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ పొట్ట లోపల అంతటా వ్యాపించవచ్చు. ఒక్కోసారి అపెండిక్స్ పగిలి ప్రాణాపాయ స్థితి కూడా సంభవించవచ్చు. అందుకే వెంటనే శస్త్రచికిత్స చేయడం ఉత్తమం.
- అపెండిసైటిస్ కు గల కారణాలు
మనం తిన్న ఆహారం అవశేషాలు లేక పెద్ద ప్రేగులలోని ఒక రకమైన నులిపురుగులు అపెండిక్స్ నాళంలో ప్రవేశించి, ఇన్ఫెక్షన్ రావడం.
శస్త్రచికిత్స పేరు "అపెండిసెక్టమీ" (Appendicectomy) అంటారు.
point.jpg[permanent dead link] [1] intestinalis appendix vermiformis.svg/400px-Tractus intestinalis appendix vermiformis.svg.png[permanent dead link]
Look up ఉండుకము in Wiktionary, the free dictionary.