ఊర్వశి (నటి)


Contributors to Wikimedia projects

Article Images

ఊర్వశి (నటి)

కవితా రంజిని (జననం 25 జనవరి 1969) భారతీయ సినిమా రంగంలో "ఊర్వశి" గా సుపరిచితురాలు. ఆమె భారతీయ సినిమా నటి, టెలివిజన్ వ్యాఖ్యాత, నిర్మాత.[2] ఆమె ప్రధానంగా మలయాళ, తమిళ చిత్రాలలో నటించింది. ఆమె "ఉల్సవెమెలం", "పిడక్కొఝి కూవున్న నూట్టండు" సినిమాలను రాసింది. తరువాత వాటిని నిర్మించింది. 2005లో విడుదలైన "అచువింటే అమ్మా" చిత్రంలో[3] ఆమె నటనక్ గాను ఉత్తమ సహాయ నటిగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని అందుకుంది.

ఊర్వశి

జననం

కవిత రంజిని[1]


జీవిత భాగస్వామి
పిల్లలు2
బంధువులు

ఊర్వశి 1969 జనవరి 25న సినిమానటుడైన చావర వి.పి.నాయర్, విజయలక్ష్మి దంపతులకు కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. ఆమె అక్కలైన శివాంజలి, కల్పన లు కూడా నటీమణులు. ఆమె సోదరులైన కమల్ రాయ్, దివంగత ప్రిన్స్ లు కూడా కొన్ని మలయాళ చిత్రాలలో నటించారు. తన సోదరుడు ప్రిన్స్ తన 26 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు.[4] ఆమె ప్రాథమిక విద్యను తిరువనంతపురంలోని ఫోర్ట్ గర్ల్స్ మిషన్ హై స్కూల్ నుండి నాల్గవ తరగతి వరకు చదివింది. తరువాత కోడంబక్కం కార్పొరేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో తొమ్మిదో తరగతి వరకు చదివింది. తరువాత ఆమె కుటుంబంతో పాటు చెన్నై వెళ్ళింది. అప్పటికి ఆమె తన సినీ కెరీర్‌లో మూడు చిత్రాలలోనటిస్తున్నందున ఆమె చదువు కొనసాగించలేకపోయింది.[5] ఆమె మూడు సినిమాలలో నటించడం చూసిన భాగ్యరాజ్ ఆమెను "ముంతనై ముడిచి" సినిమాలోనటించడానికి బుక్ చేసాడు. ముంతనై ముడిచి కాల్‌షీట్స్‌లో ప్రాధాన్యత పొందడానికి ఆ ముగ్గురు దర్శకులు ఆమెకు సహాయం చేశారు. ఈ సినిమా విజయవంతమైనచో తమ సినిమాలను విడుదల చేసి లాభాలు పొందవచ్చని వారు ఆశించారు.

ఊర్వశి 2000 మే 2న సినిమా నటుడైన మనోజ్ కె. జయన్ ను వివాహం చేసుకుంది. వారికి ఒక కూమర్తె 2001 నవంబరులో కలిగింది. 2008లో తన మొదటి భర్త మనోజ్ కె. జయన్ నుండి విడాకులు తీసుకున్న తరువాత, ఊర్వశి నవంబర్ 2013లో చెన్నైకి చెందిన బిల్డర్ శివప్రసాద్‌ను వివాహం చేసుకుంది. వారికి ఆగస్టు 2014లో కుమారుడు జన్మించాడు.[6]