ఒసేయ్ రాములమ్మా


Contributors to Wikimedia projects

Article Images

ఒసేయ్ రాములమ్మా

1997 సినిమా

ఒసేయ్ రాములమ్మా 1997లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఒక విప్లవ చిత్రం. ఇందులో విజయశాంతి, దాసరి, రామిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా అన్యాయానికి గురైన ఒక దళిత మహిళ చేసిన పోరాటమే ఈ చిత్రం. ఒక సాధారణ మహిళా నక్సలైట్ గా ఎలా మారింది అనేది కథాంశం. ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ యాదవ్ సంగీతాన్నందించడమే కాక దాదాపు అన్ని పాటలు ఆయనే పాడాడు.

ఒసేయ్ రాములమ్మా
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం దాసరి నారాయణరావు ,
కృష్ణ ,
విజయశాంతి, రామిరెడ్డి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ దాసరి ఫిల్మ్ యూనివర్సిటి
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఇందులో పాటలన్నీ దాదాపు ప్రజా కవులు రాసినవే. సంగీత పరంగా కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

  1. ఓ ముత్యాల బొమ్మా., రచన: సి నారాయణ రెడ్డి గానం. వందేమాతరం శ్రీనివాస్
  2. ఓ చౌదరి గారూ! ఓ నాయుడు గారూ! రచన: గండవరపు సుబ్బారావు, గానం. వందేమాతరం శ్రీనివాస్
  3. రాములమ్మ ఓ రాములమ్మ ఓహో , రచన: సుద్దాల అశోక్ తేజ గానం.వందేమాతరం శ్రీనివాస్
  4. లచ్చులో లచ్చన్నా , రచన: గూడ అంజయ్య, గానం. వందేమాతరం శ్రీనివాస్
  5. ఏ అసురుడు సృష్టించిన పంచమ వేదం , రచన: సి నారాయణ రెడ్డి, గానం. వందేమాతరం శ్రీనివాస్
  6. ఎరుపు రంగు ఏడ ఉంటే ఆడే ఉంటానంటినవి , రచన: దాసరి నారాయణరావు, గానం. చిత్ర
  7. రామ చక్కని , రచన: సుద్దాల అశోక్ తేజ గానం.ఎం ఎం కీరవాణి , ఎం ఎం శ్రీలేఖ
  8. అద్దలోరి బుద్దయ్య , రచన: జయవీర్ , గానం.మనో
  9. ఇంటి ఈ ఇంటి , రచన: సుద్దాల అశోక్ తేజ గానం.వందేమాతరం శ్రీనివాస్
  10. పుల్లాల మంటివి గదరా, రచన: సుద్దాల అశోక్ తేజ,గానం. వందేమాతరం శ్రీనివాస్, ఎస్. జానకీ.