కమలమ్మ కమతం


Contributors to Wikimedia projects

Article Images
కమలమ్మ కమతం
(1979 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కోటయ్య ప్రత్యగాత్మ
తారాగణం కృష్ణంరాజు,
జయంతి,
పల్లవి
నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

సిరులు పండే మాగాణి, మెట్ట వందల ఎకరాలు కలిగి ఉన్న కమలమ్మ మంచి వయసులో ఉంటుంది. అయితే ఆమె వితంతువు. పాలేరు రాముడు ఆమెకు కొండంత అండగా ఉంటాడు. ఆ ఊరి మునసబు, ప్రెసిడెంటు, పూజారి కమలమ్మపైనా, ఆమె కమతంపైనా కన్నువేస్తారు. కమలమ్మ అన్నను తమవైపు తిప్పుకుంటారు. అయితే కమలమ్మ తన తెలివితేటలతో ఆ త్రిమూర్తుల ఎత్తులను చిత్తు చేస్తూ వుంటుంది. అన్నను దూరంగా పంపించివేస్తుంది. అన్న గదిని శుభ్రం చేయించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిన బూతు పుస్తకాలు ఆమెకు వికారాన్ని కలిగిస్తాయి. తనను తల్లిగా చూసుకునే రాముడి మీద ఆమె దృష్టి పడుతుంది. రాముడికి అతని అక్క కూతురితో పెళ్లి అవుతుంది. ప్రెసిడెంటు మనుషులు కుప్ప తగలపెట్టినప్పుడు శరీరం కాలిన రాముడికి కమలమ్మ సపర్యలు చేయబోయి తన తప్పును తెలుసుకుంటుంది. ప్రెసిడెంటు, మునసబు, పూజారి వూరిలో వారందరికీ కమలమ్మకు, రాముడికి సంబంధం ఉందని ప్రచారం చేసి అందరినీ కమలమ్మ ఇంటి మీదకు దాడి చేయడానికి తీసుకువస్తారు. ఇంటి గదులన్నీ తాళాలు వేసి వుంటాయి. కమలమ్మ కనిపించడు. రాముడూ కనిపించడు.[1]

  • కథ: సి.ఎస్.రావు
  • దర్శకుడు: ప్రత్యగాత్మ
  • సంగీత దర్శకుడు: చలపతిరావు
  • ఛాయాగ్రహణం: సెల్వరాజ్
  • నిర్మాత: ఎ.వి.సుబ్బారావు
క్రమసంఖ్య పల్లవి గాయనీగాయకులు సంగీత దర్శకుడు రచయిత
1 అత్తకూతురా చిట్టి మరదలా కొత్త చీరలో నిన్ను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
తాతినేని చలపతిరావు జాలాది
2 ఇంటి ముందు ఈత చెట్టు ఇంటి వెనక తాటి చెట్టు విజయలక్ష్మి శర్మ,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
తాతినేని చలపతిరావు కొసరాజు
3 ఏమౌతుంది ఇప్పుడేమౌతుంది ఇట్టా ఇట్టా ఇది ఎందాక ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి
తాతినేని చలపతిరావు వేటూరి
4 తొలిసారి మొగ్గేసింది సిగ్గు పాడు సిగ్గు ఆ సిగ్గే మొగ్గై పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
తాతినేని చలపతిరావు వేటూరి
5 నిమ్మ చెట్టుకు నిచ్చెనేసి నిమ్మపళ్ళు కొయ్యబోతే ఎస్.జానకి తాతినేని చలపతిరావు కొసరాజు
  1. వి.ఆర్. (6 March 1979). "చిత్రసమీక్ష - కమలమ్మకమతం". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 65, సంచిక 328. Retrieved 10 December 2017.[permanent dead link]