కల్పన (సినిమా)


Contributors to Wikimedia projects

Article Images

'కల్పన' తెలుగు చలన చిత్రం, శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్ ప్రైసెస్ 1977 ఏప్రిల్ 22 న విడుదల చేసింది.ఈ చిత్రంలో మురళీమోహన్, జయచిత్ర జంటగా నటించారు.కోవెలమూడి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.

కల్పన
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె. రాఘవేంద్ర రావు
తారాగణం మురళీమోహన్,
జయచిత్ర
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ అన్నపూర్ణ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

మాగంటి మురళి మోహన్

జయచిత్ర

గుమ్మడి వెంకటేశ్వరరావు

గిరిబాబు

కైకాల సత్యనారాయణ

అల్లు రామలింగయ్య

జయమాలిని .

దర్శకుడు: కె.రాఘవేంద్రరావు

సంగీతం:కొమ్మినేని చక్రవర్తి

నిర్మాణ సంస్థ: శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్ ప్రైసెస్

గీత రచయితలు: సి నారాయణ రెడ్డి, వేటూరి సుందర రామమూర్తి,మైలవరపు గోపి,

గాయనీ గాయకులు: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జి ఆనంద్

విడుదల:22:04:1977.

హిందీ చిత్రం "అనామిక" తెలుగురూపం ఈ చిత్రం.అపరిచితురాలైన జయచిత్ర, మురళీమొహన్ భార్యనంటూ అతని ఇంటికి వస్తుంది. ద్వేషంతో మొదలైనా, ఆమెను అతడు ప్రేమిస్తాడు. తర్వాత జయచిత్ర అతనికి దూరమౌతుంది. కొంత సస్పెన్స్ తో చిత్ర కథ నడుస్తుంది. చిత్రం నలుపు తెలుపులో నిర్మించబడింది.

పాట రచయిత సంగీతం గాయకులు
వదలనురా నిను రఘురామా నా జీవితము నవపారిజాతము ఏనాడో అది నేకే అంకితము వేటూరి చక్రవర్తి పి.సుశీల
ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం వేటూరి చక్రవర్తి బాలసుబ్రహ్మణ్యం
దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ వేటూరి సుందర రామమూర్తి చక్రవర్తి జి. ఆనంద్

అర్థరాత్రిరీ పొద్దుపొడిచేనా నీటిమాటున నిప్పు, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పులపాక సుశీల

పొద్దు వాలిపోయాక వూరు సద్దుమణిగాక, రచన:మైలవరపు గోపి, గానం.పులపాక సుశీల .

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.