కితకితలు


Contributors to Wikimedia projects

Article Images

కితకితలు హాస్య వినోదభరిత చిత్రం. ఇందులో అల్లరి నరేష్, గీతా సింగ్, తనికెళ్ళ భరణి, గిరి బాబు, జయప్రకాశ్ రెడ్డి, కృష్ణ భగవాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాను ఇవివి సత్యనారాయణ తన స్వీయ దర్శకత్వం లో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సత్యం స్వరాలు సమకుర్చారు.

కితకితలు
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
నిర్మాణం ఇ.వి.వి.సత్యనారాయణ
తారాగణం అల్లరి నరేష్, మధు శాలిని, గీతా సింగ్, సునీల్, బ్రహ్మానందం, లక్ష్మీపతి, గిరిబాబు, జయప్రకాశ్ రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎ.వి.ఎస్., ఎల్. బి. శ్రీరాం, కృష్ణ భగవాన్, రఘుబాబు, వేణుమాధవ్, ఆలీ
ఛాయాగ్రహణం జయరాం
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ ఇవివి సినిమా
భాష తెలుగు
పెట్టుబడి 39 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కొత్తగా ఉద్యోగంలో చేరిన ఎస్సై రేలంగి రాజబాబు (నరేష్‌). ఇంట్లో వాళ్ళంతా ఉరేసుకుంటానని బెదిరిస్తే తప్పని పరిస్ధితిలో కోటీశ్వరురాలు, స్ధూలకాయురాలైన సౌందర్య (గీతాసింగ్‌)ను పెళ్ళాడుతాడు. ఇష్టం లేని పెళ్ళితో కష్టంగా హనీమూన్‌కి వెళ్ళిన రాజబాబుకి రంభ (మధుశాలిని) పరిచయమవుతుంది. అతని డబ్బు చూసి మోజుపడుతుంది. రాజబాబు తన భార్యని చిన్న చూపు చూసి రంభ వెంటపడతాడు. పెళ్ళానికి విడాకులిచ్చి మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. చివరకు తన తప్పు తెలుసుకొని, భార్యతోనే ఉంటాడు.