గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం


Contributors to Wikimedia projects

Article Images

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 4 న దీని పరిధికి గుంటూరు జిల్లాను పరిమితం చేశారు.

2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం చాలా మార్పులకు గురైంది. ఇంతకు క్రితం గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు శాసనసభా నియోజకవర్గాలు నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి బదిలీ అయ్యాయి. గతంలో తెనాలి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న తెనాలి, మంగళగిరి శాసనసభా నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో వచ్చిచేరాయి. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం 2022లో జరిగిన జిల్లాల పునర్విభజనలో గుంటూరు జిల్లాకు పరిమితమైంది. ఈ లోక్‌సభ స్థానంలో 18 మండలాలు ఉన్నాయి.

  1. గుంటూరు తూర్పు,
  2. గుంటూరు పశ్చిమ,
  3. తాడికొండ (SC) ,
  4. తెనాలి,
  5. పొన్నూరు,
  6. ప్రత్తిపాడు (SC) ,
  7. మంగళగిరి,
  • 2001 లెక్కల ప్రకారం జనాభా: 18,36,008 [1]
  • ఓటర్ల సంఖ్య: 12,97,103.
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 18.33%, 3.07%.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
మొదటి 1952-57 ఎస్.వి.ఎల్.నరసింహారావు స్వతంత్ర అభ్యర్ధి
రెండవ 1957-62 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు
మూడవ 1962-67 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ 1967-71 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఆరవ 1977-80 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 ఎన్.జి.రంగా భారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ 1984-89 ఎన్.జి.రంగా భారత జాతీయ కాంగ్రెసు
తొమ్మిదవ 1989-91 ఎన్.జి.రంగా భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 ఎస్. ఎమ్. లాల్ జాన్ భాషా తెలుగుదేశం పార్టీ
పదకొండవ 1996-98 రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు
పన్నెండవ 1998-99 రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు
పదమూడవ 1999-04 యంపరాల వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
పద్నాలుగవ 2004-2009 రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు
పదిహేనవ 2009- 2014 రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు
పదహారవ 2014-2019 గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ
పదిహేడవ 2019 - 28 జనవరి 2024 గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ
18వ[2][3] 2024 - ప్రస్తుతం పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ

2004 ఎన్నికల ఫలితాలను చూపే చిత్రం

  యంపర్ల వెంకటేశ్వరరావు (40.95%)

  జె.హనుమంతరావు గౌడ్ (1.14%)

  ఇతరులు (1.15%)

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు.[4] ప్రజారాజ్యం తరఫున తోట చంద్రశేఖర్ పోటీలో ఉన్నాడు.[5] ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మేడల రాజేంద్రపై విజయం సాధించారు. రాయపాటి సాంబశివరావుకు 403937 ఓట్లు రాగా, రాజేంద్రకు 364582 ఓట్లు వచ్చాయి.

  1. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92862&subcatid=17&categoryid=3
  2. EENADU (5 June 2024). "గుంటూరు, నరసరావుపేట లోక్‌సభ స్థానాల్లోనూ ఘన విజయం". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Guntur Loksabha Election Result". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  4. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  5. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009