గుత్తికొండ నరహరి


Contributors to Wikimedia projects

Article Images

గుత్తికొండ నరహరి (ఆగష్టు 10, 1918 - మార్చి 27, 1985) రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. మానవతా వాది.

గుత్తికొండ నరహరి

గుత్తికొండ నరహరి

జననంగుత్తికొండ నరహరి
ఆగష్టు 10, 1918
యలవర్రు గ్రామం, అమృతలూరు మండలం గుంటూరు జిల్లా
మరణంమార్చి 27, 1985
వృత్తినవ్య మానవవాద రాష్ట్ర పార్టి కార్యదర్శి
ప్రసిద్ధిరచయిత, సంపాదకులు
రాజకీయ పార్టీ1972లో క్షాత్ర ధర్మ పరిషత్ అనే రాజకీయ పార్టి
మతంహిందూ మతము
భార్య / భర్తసరోజిని
తండ్రిఆంజనేయులు,
తల్లిరాఘవమ్మ

తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగా, రాజకీయ విశ్లేషకుడుగా రాణించిన గుత్తికొండ నరహరి ఆగస్టు 10, 1918 న ఆంజనేయులు, రాఘవమ్మ దంపతులకు యలవర్రు గ్రామం, అమృతలూరు మండలం (గుంటూరు జిల్లా) లో పుట్టాడు. ఈ గ్రామం ప్రసిద్ధులకు కాణాచి. సుప్రసిద్ధ శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ అక్కడివాడే. సమీపంలో వున్న తురుమెళ్ళ పాఠశాలలో చదువుకున్నాడు. యలవర్తి రోశయ్య, మల్లంపాటి మధుసూదన ప్రసాద్ తన సహాధ్యాయులు. కాలేజీలో చేరకుండానే బర్మా లోని రంగూన్ వెళ్ళి రెండేళ్ళు పత్రికా విలేఖరిగా పనిచేసి, తిరిగి వచ్చి గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బి.ఎ. పూర్తి గావించాడు. మద్రాసులో న్యాయశాస్త్రములో చేరి మధ్యలోనే స్వస్తిపలికి, ఎం.ఎన్.రాయ్ ప్రభావంలో నవ్య మానవవాద రాష్ట్ర పార్టీ కార్యదర్శి అయ్యాడు. 1944 లో గూడవల్లి లో, మేనమామ కూతురు సరోజినితో పెళ్ళి అయింది. ఈ వివాహం లౌకిక (Secular way) పద్ధతిలో జరిగి, నమోదు చేయబడింది.

1946 ఎన్నికలలో నరహరి యువత నుద్దేశించి పదవులకు రాజీనామాలు చేయమని, దేశ స్వాతంత్రం కొరకు త్యాగం చేస్తే తరువాత ఉన్నత పదవులు వస్తాయని బోధ చేశాడు. రాడికల్ రాజకీయాలలో అటు కమ్మూనిస్ట్ లను, ఇటు కాంగ్రెస్ వారిని ఎదురుకొని, తన ధారాళ ఉపన్యాసాలతో జనాన్ని ఆకట్టుకున్నాడు.

ములుకోల, ప్రజామిత్ర, సమీక్ష పత్రికలలో వ్యాసాలు వ్రాసాడు. విహారి, ఆంధ్రా లేబరు పత్రికల సంపాదకత్వం వహించాడు. రాజకీయ పాఠశాలలో ఎందరినో సుశిక్షితులను గావించాడు.

గోపీచంద్, ఆవుల గోపాలకృష్ణమూర్తి, ఎం.వి.రామమూర్తి, కోగంటి రాధాకృష్ణమూర్తి, పి.వి.సుబ్బారావు, రావిపూడి వెంకటాద్రి, ఎన్.వి.బ్రహ్మం లతో నవ్య మానవ వాద ఉద్యమంలో పనిచేశాడు. ఎ.సి.కాలేజి ప్రిన్సిపాల్ టి.ఎస్.పాలస్ కు దగ్గర మిత్రుడు. కొన్నాళ్ళు ఆచార్య రంగాతో పనిచేశాడు.

1972లో క్షాత్ర ధర్మ పరిషత్ అనే రాజకీయ పార్టీ పెట్టి, లోక్ సభకు పోటీ చేశాడు. అసంపూర్తిగా వదిలేసిన లాను పూర్తి చేసి, 1974 లో, హైదరాబాదులో ప్రాక్టీస్ చేసాడు.

గుంటూరులో పొగాకు కంపెనీ పెట్టి వ్యాపారం చేశాడు. కొత్త రఘురామయ్యతో కొన్నేళ్ళు కలసి పనిచేశాడు. అప్పుడే వి. కె. కృష్ణ మేనన్ కు చేరువయ్యాడు. పొగాకు వ్యాపారంలో దెబ్బతిన్న తరువాత తన ప్రతిభను రచనలకు వినియోగించాడు. కాని అవి ఇప్పుడు లభించడం లేదు. పొగాకు వాణిజ్యం కోసం కంపెనీల ఆర్డర్లు పొందడానికి తొలుత జపాన్ వెళ్ళాడు. పిమ్మట అనేక దేశాలు పర్యటించి ఆర్డర్లు తెచ్చాడు. వాణిజ్య పరమైన సమావేశాలు జరిపి, పొగాకు నాణ్యతపై వ్యాసాలు ప్రత్యేక సంచికలలో రాశాడు.

1955 లో ఆంధ్ర ప్రభ ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావుకు ఎం.ఎన్.రాయ్ పూర్తి సాహిత్యం అందచేసి ఆయన నవ్య మానవ వాదిగా మారడానికి నరహరి కారకుడయ్యాడు. ఎం.ఎన్.రాయ్ 1955 లో మరణించినప్పుడు ఆయనపై సంపాదకీయం రాయక పోగా, వార్త కూడా ఆంధ్రప్రభలో వేయనందుకు ఆవుల గోపాలకృష్ణమూర్తి విరుచుకపడి నార్లను దుయ్యపట్టాడు. అప్పుడు నరహరిని కోరి, రాయ్ సాహిత్యం, నార్ల తెప్పించుకున్నాడు. నార్ల ఆలోచనా విధానం పై ఎం.ఎన్.రాయ్ రచనలు, సిద్ధాంతాలు ప్రభావితం చేశాయి.

కొండవీటి వెంకటకవి తన నెహ్రూ కావ్యం ద్వితీయ భాగాన్ని నరహరికి అంకితం ఇచ్చాడు. ఎన్.కె.అచార్య, ఆలపాటి రవీంద్రనాథ్, ఎన్.ఇన్నయ్య లతో హేతువాద, మానవవాద విషయాలలో కలసి పనిచేశాడు. నరహరి రాష్ట్ర రాడికల్ డెమొక్రాటిక్ పార్టీ కార్య దర్శిగా మానవ విలువలను ప్రజలలోకి తీసుకెళ్ళడానికి కృషి చేశాడు. మూఢనమ్మకాలు వున్న జనానికి చక్కగా శాస్తీయ విషయాలు విడమరచి చెప్పడంలో అందెవేసిన నరహరి,

గుత్తికొండ నరహరి గారు 1985 మార్చి 27 న చనిపోయాడు.