జనతా పార్టీ


Contributors to Wikimedia projects

Article Images

జనతా పార్టీ

భారత రాజకీయ పార్టీ

1975లో ఇందిరాగాంధీ విధించిన అత్యవసర స్థితి తరువాత లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గారి మార్గదర్శకత్వంలో విపక్ష పార్టీలన్నీ ఒకే పార్టీగా అవతరించాలని నిర్ణయించాయి. అలా ఏర్పడిందే జనతా పార్టీ. ఇందులో భారతీయ లోక్ దళ్, భారతీయ జనసంఘ్, సోషలిస్టు పార్టీ, కాంగ్రెస్ (ఓ) ముఖ్య పార్టీలు. ఈ పార్టీకి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జయప్రకాష్ నారాయణ నేతృత్వం వహించాడు. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఓడించి దేశ చరిత్రలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది జనతాపార్టీ. అప్పుడు మొరార్జీ దేశాయ్ దేశంలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయ్యారు.

జనతా పార్టీ

స్థాపకులుజయప్రకాశ్ నారాయణ్
స్థాపన తేదీ23 జనవరి 1977; 47 సంవత్సరాల క్రితం
రద్దైన తేదీ11 ఆగస్టు 2013; 11 సంవత్సరాల క్రితం
యువత విభాగంజనతా యువమోర్చా
మహిళా విభాగంజనతా మహిళా మోర్చా
రాజకీయ విధానంభారత జాతీయవాదం
పాపులిజం
పక్షాలు:
గాంధేయ సోషలిజం
సామాజిక న్యాయం
అవినీతి నిరోధక
పెద్ద గుడారం
రాజకీయ వర్ణపటంకేంద్రీకృతం
జనతా పార్టీకి నేత్రత్వం వహించిన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ చిత్రం

ఆ తరువాత రెండేళ్ళకు అంతర్గత కలహాలతో జనతా ప్రభుత్వం కూలిపోయింది. జనతా పార్టీలో చీలికలు వచ్చి మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ వర్గాలుగా విడిపోయింది, తరువాత 1980లో జరిగిన మధ్యంతర లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పాత జనసంఘ్ పార్టీకి చెందినవారు, భారతీయ జనతా పార్టీగా, పాత భారతీయ లోక్‌దళ్‌కు పార్టీకి చెందినవారు, లోక్‌దళ్‌ పార్టీగా రూపాంతరం చెందారు. మిగిలినవారు జనతా పార్టీగా కొనసాగి అనేక వర్గాలుగా విడిపోయారు.