జి. ఆనంద్


Contributors to Wikimedia projects

Article Images

జి. ఆనంద్ తెలుగు నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు. అతను నవతరం స్వర మాధురి సంస్థతో వర్ధమాన, ఔత్సాహిక గాయనీ, గాయకులకు ప్రదర్శనావకాశాలు కల్పించాడు. ప్రపంచ వ్యాప్తంగా 6,500 పైగా కచేరీలు నిర్వహించాడు.[1]

గేదెల ఆనందరావు.

జి. ఆనంద్

జననంగేదెల ఆనందరావు.
1957
తులగం, శ్రీకాకుళం జిల్లా
మరణం6 మే 2021
మరణ కారణంకరోనా
ప్రసిద్ధితెలుగు సినిమా సంగీత దర్శకులు, నేపద్య గాయకులు

అతను శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు. అతని పూర్తిపేరు గేదెల ఆనందరావు. అతని పుట్టినజిల్లా పట్ల ప్రేమతో జిల్లాలో జరిగిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటాడు. అతను అమెరికాలో 14 ప్రదర్శనలు ఇచ్చాడు. సుమారు 2,500 పాటలు పాడాడు. 150 ఆల్బమ్‌సు చేసాడు . సినిమా అవకాశాలు లేకపోయిన సందర్భంలో కూడా డబ్బింగు ఆర్టిస్టు గాను, అనేక టి.వి. సీరియల్స్ లో సంగీత దర్శకుడుగా రాణించాడు.

పండంటి కాపురం సినీమాతో గాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఆయన ఎంతో మందిని సినీ, దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశాడు. అతను తన తొలి పాట "ఎన్నియల్లో.. ఎన్నీయల్లో.. ఎందాకా.." ను చిరంజీవి నటించిన సినిమాకే పాడాడు[2].

షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం, గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందించారు. ఎన్నో భక్తి పాటల అల్బుమ్స్ చేసాడు.

  • ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, (అమెరికా అమ్మాయి).
  • దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ, (కల్పన).
  • విఠలా విఠలా పాండురంగ విఠలా, (చక్రధారి)
  • దూరానా దూరానా తారాదీపం, (బంగారక్క)

జి. ఆనంద్ కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతుతూ సకాలంలో ఆక్సిజన్ అందక 2021 మే 6న మృతి చెందాడు.[3]