తొట్లకొండ


Contributors to Wikimedia projects

Article Images

తొట్లకొండ బౌద్ధ సముదాయం (17 15 ఉ - 83 23 తూ) విశాఖపట్నం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో భీమిలి వెళ్లే దారిలో సముద్రతీరానికి అభిముఖంగా 128 మీటర్ల ఎత్తున్న ఒక కొండపై ఉంది. కొండపై వర్షపు నీటిని సేకరించడానికి రాతిలో తొలచిన అనేక తొట్లు ఉండటంవళ్ళ తొట్లకొండ అని పేరు వచ్చింది. తొట్లకొండ ప్రాచీన కళింగ ప్రాంత ప్రభావంలో ఉండి ఇక్కడ నుండి బౌద్ధ సంస్కృతి శ్రీలంక, తదితర ఆగ్నేయాసియా దేశాలలో వ్యాపించేందుకు ప్రధాన కేంద్రంగా దోహదం చేసింది. తొట్లకొండ, భారతీయ సంస్కృతి ముఖ్యంగా బౌద్ధం ఖండాంతర ప్రదేశాలకు ప్రసరించిన పద్ధతికి అద్దంపడుతుంది.

తొట్లకొండ బౌద్ధవిహారంలో మహాస్థూపం
తొట్లకొండ బౌద్ధవిహారం యొక్క పనోరమా దృశ్యం
తొట్లకొండ సమీపంలోని తొట్లకొండ బీచ్
  • క్రీ.పూ మూడవ శతాబ్దానికి చెందిన తొట్లకొండ బౌద్ధ స్థూపం శిథిలాలు

  • తొట్లకొండ వద్ద గజవృశష్టాకార స్థూపం శిథిలాలు

  • తొట్లకొండ వద్ద మొక్కుబడి స్తూపాలు

  • తొట్లకొండ దారిలో బుద్ధ విగ్రహం

  • తొట్లకొండ స్తూపాలు

  • తొట్లకొండ బౌద్ధ శిథిలాలు

  • తొట్లకొండ స్థూపం యొక్క దృశ్యం

వికీమీడియా కామన్స్‌లో Thotlakondaకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.