దర్భంగా


Contributors to Wikimedia projects

Article Images

దర్భంగా

బీహార్ రాష్ట్రం లోని పట్టణం

దర్భంగా బీహార్ లోని నగరం. ఇది దర్భంగా జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది దర్భంగా డివిజన్ ప్రధాన కార్యాలయం కూడా. దర్భంగా సంస్థానానికి కూడా రాజధానిగా ఉండేది. నగర పరిపాలనను మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. పాట్నా, గయ, భాగల్పూర్, ముజఫర్పూర్, పూర్ణియా తరువాత ఇది, బీహార్లో 6 వ అతిపెద్ద నగరం.

దర్భంగా

నగరం

దర్భంగా is located in Bihar

దర్భంగా

దర్భంగా

బీహార్ రాష్ట్రంలో నగర స్థానం

Coordinates: 26°10′N 85°54′E / 26.17°N 85.9°E
దేశంభారతదేసం
రాష్ట్రంబీహార్
ప్రాంతంమిథిల
జిల్లాదర్భంగా
Government
 • Typeమునిసిపల్ కార్పొరేషను
 • Bodyదర్భంగా మునిసిపల్ కార్పొరేషను
విస్తీర్ణం
 • Total19 కి.మీ2 (7 చ. మై)
Elevation52 మీ (171 అ.)
జనాభా

 (2011)

 • Total2,94,116
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN

846001–846009[2]

టెలిఫోన్ కోడ్06272
ISO 3166 codeIN-BR
Vehicle registrationBR-07
లింగనిష్పత్తి910:1000 /
దర్భంగా నగరంలో మతం
మతం శాతం
హ్ందూ మతం 71.76%
ఇస్లాం 27.76%
క్రైస్తవం 0.18%
సిక్కుమతం 0.11%
బౌద్ధం 0.01%
జైనమతం 0.01%
చెప్పలేదు 0.16%

2011 జనాభా లెక్కల ప్రకారం దర్భంగా మునిసిపల్ కార్పొరేషన్‌గా 267,348 జనాభాతో 142,377 మంది పురుషులు, 124,971 మంది మహిళలు ఉన్నారు, మొత్తం జిల్లాలో 3 మిలియన్ల జనాభా ఉంది.[3] పట్టణ జనాభా పరంగా ఇది బీహార్‌లో 6 వ అతిపెద్ద నగరం. జనాభాలో పురుషులు 52.6%, స్త్రీలు 47.4%. దర్భంగా సగటు అక్షరాస్యత 79.40% కాగా, పురుషుల అక్షరాస్యత రేటు 85.08%, మహిళలు 73.08%.[4]

దర్భంగాలో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంది ( కొప్పెన్ వాతావరణ వర్గీకరణ Cwa ).

శీతోష్ణస్థితి డేటా - Darbhanga (1971–1990, extremes 1901–1998)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
[ఆధారం చూపాలి]

మధ్య సెంట్రల్ రైల్వేలో దర్భంగా జంక్షన్ ఉంది. ఇది భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు నేరుగా అనుసంధానించబడి ఉంది. 

దర్భంగాలో, దాని పొరుగు ప్రాంతాలలో రైలుమార్గాన్ని ప్రారంభించిన సమయంలో ది ఇంపీరియల్ గెజిటీర్ ఆఫ్ ఇండియా ఇలా పేర్కొంది:

1874 నాటి కరువు, రైలుమార్గాల నిర్మాణానికి గొప్ప ప్రేరణ నిచ్చింది. కమ్యూనికేషన్ల విషయంలో జిల్లా మొత్తం ముందంజలో ఉంది. దీని నైరుతి మూలలో బెంగాల్ అండ్ నార్త్-వెస్ట్రన్ రైల్వే వారి ప్రధాన మార్గం 29 మైళ్ళ దూరం పాటు నడుస్తుంది. హాజీపూర్ నుండి బచ్వారా వరకు కొత్త శాఖకు 25 మైళ్ళ దూరంలో ఉంది. ఇది తూర్పు నుండి పడమరకు గంగానది కరకట్టకు సమాంతరంగా నడుస్తుంది . సమస్తిపూర్ నుండి దర్భంగా పట్టణానికి ఒక మార్గం నడుస్తుంది. అక్కడి నుండి రెండు దిశలలో చీలుతుంది. మొదటిది వాయువ్య దిశలో సీతామఢీ నుండి కమతౌల్, జోగియారా వరకూ, మరొకటి తూర్పు ప్రతాప్గంజ్ సమీపంలోని కోసి (పాత ప్రవాహం) లోని ఖాన్వా ఘాట్ వరకూ నడుస్తాయి. జిల్లా పరిధిలో ఈ రైలుమార్గాల మొత్తం పొడవు 146 మైళ్ళు. సక్రీ నుండి నేపాల్ సరిహద్దులోని జైనగర్ వరకు ఒక రైలు మార్గం వేయడం కోసం మట్టిపని చాలావరకు పూర్తైంది. 1897 కరువు సమయంలో సహాయక చర్యగా ఆ పని చేసారు. ఇప్పుడు తెరిచిన ఈ మార్గం, నేపాల్ లోని మిగులు ధాన్యం సరఫరా చేసేందుకు వాడుకోవచ్చు.

దర్భంగా జంక్షన్ ఉత్తర బీహార్ లోని పెద్ద భాగాన్ని, నేపాల్ లోని టెరాయ్‌నీ మిగతా భారతదేశంతో కలుపుతుంది. ఇది దర్భంగా జిల్లా మధుబని జిల్లాల్లో ప్రధానమైన స్టేషను .

దర్భంగా విమానాశ్రయం ( IATA : DBR, ICAO : VE89 ) భారత వైమానిక దళంలోని దర్భంగా వైమానిక దళం స్టేషన్ లో ఉన్న ఒక పౌర విభాగం. ఇది బీహార్ లోని దర్భంగా నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఈస్ట్-వెస్ట్ కారిడార్ ఎక్స్‌ప్రెస్ వేకు దగ్గరగా ఉంది. సివిల్ ఎన్‌క్లేవ్‌ను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిర్వహిస్తుంది. 2018 డిసెంబరు 24 న పౌర విభాగం నిర్మాణానికి పునాదిరాయి వేయగా, వాణిజ్య విమానాలు 2020 నవంబర్ 8 నుండి ప్రారంభమయ్యాయి.[5] ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు అహ్మదాబాద్, పూణే, హైదరాబాద్ లకు నేరుగా విమానాలు అందుబాటులో ఉన్నాయి.

జాతీయ రహదారి 27, జాతీయ రహదారి 527 బి, బీహార్ రాష్ట్ర రహదారులు 50, 56, 88, 75 దర్భంగా నగరం గుండా వెళ్తూ నగరం నుండి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చక్కటి రవాణా సౌకర్యాన్ని కలుగజేస్తున్నాయి.. దర్భంగా నుండి మధుబని, సీతామఢీకి కూడా చక్కటి రోడ్డు సౌకర్యాలున్నాయి.

గుజరాత్‌లోని పోర్బందర్‌ను అస్సాంలోని సిల్చార్‌తో కలిపే ఈస్ట్-వెస్ట్ కారిడార్ ఎక్స్‌ప్రెస్‌వే దర్భంగా గుండా వెళుతుంది.

 
దర్భంగా మెడికల్ కాలేజీ, హాస్పిటల్ యొక్క ప్లాటినం జూబ్లీ గేట్
  • దర్భంగా మెడికల్ కాలేజీ, హాస్పిటల్
  • శ్యామా సర్జికల్ సంస్థా హాస్పిటల్
  • ఎయిమ్స్, దర్భంగా (నిర్మాణంలో ఉంది)

ఇంజనీరింగ్, టెక్నాలజీ కళాశాలలు

మార్చు

  • ఉమెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
  • దర్భంగా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (జెఎంఐటి)
  • మిల్లట్ కళాశాల
  • సిఎం సైన్స్ కళాశాల, దర్భంగా
  • సీఎం కళాశాల
  • మార్వారీ కళాశాల
  • కున్వర్ సింగ్ కళాశాల