దవ్తాషెన్ జిల్లా


Contributors to Wikimedia projects

Article Images

దవ్తాషెన్, ఆర్మేనియా దేశ రాజధానయిన యెరెవాన్లో ఉన్నటువంటి 12 జిల్లాలలో ఒకటి. హ్రజ్డాన్ నదికి కుడి పక్కన ఉన్న దవ్తషెన్ కు సరిహద్దులుగా దక్షిణాన అజప్న్యాక్, అరబ్కిర్, ఉత్తరాన కొటాయ్క్ రాష్టృం ఉన్నవి.

దవ్తాషెన్

Դավթաշեն

అరగాట్ పర్వతాల నుండి జిల్లా

అరగాట్ పర్వతాల నుండి జిల్లా

ఎరుపు రంగులోని జిల్లా

ఎరుపు రంగులోని జిల్లా

దేశంఆర్మేనియా
మార్జ్ (రాజ్యం)యెరెవన్
విస్తీర్ణం
 • Total6.71 కి.మీ2 (2.59 చ. మై)
Elevation1,120 మీ (3,670 అ.)
జనాభా

 (2011 జనాభా)

 • Total42,380
 • జనసాంద్రత6,300/కి.మీ2 (16,000/చ. మై.)
Time zoneUTC+4 (AMT)

ఇది యెవెరన్ నగరంలోని 2.9% భూభాగం అనగా 6.47 చ.కి. వైశాల్యంలో ఉంది. అజప్న్యాక్ వైశాల్యపరంగా యెరవాన్ లో రెండవ అతిచిన్న జిల్లా. ఇది అనధికారికంగా అనేక విభాగాలుగా విభజింపబడినది అవి: దవ్తాషెన్ యొక్క నాలుగు బ్లాక్కులు, ఉత్తర దవ్తాషెన్, హుసి అవన్. సస్నా సర్ వీధి, టిగ్రాన్ పెట్రోసియన్ వీధి, పిరుమియాస్ వీధి, అఘబబ్యాన్ వీధి, అనస్టాస్ మికోయన్ వీధి జిల్లాలోని కొన్ని ముఖ్యమైన వీధులు. దవ్తాషెన్ లోని ఒకటి, రెండు నివాస స్థలాలను పిరుమియాన్స్ వీధిపై ఉన్న ఒక దీర్ఘచతురస్త్ర పార్కు వేరుచేస్తుంది. 2012, 2013లో ప్రజా సేవలు అమలయ్యే విధానాన్ని విశ్లేషించన తరువాత, దవ్తాషెన్ ను రెండుసార్లు యెరెవాన్ లోని అత్యుత్తమ జిల్లాగా ప్రకటించారు. అర్మేనియా యొక్క డైరెక్టరీ ఆఫ్ పాస్పోర్ట్, వీసా పోలీసుల,  అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ ఇక్కడే ఉన్నాయి.

1930 సమయంలోని సోవియట్ రోజులలో ఈ ప్రాంతాన్ని అరాజిన్ గ్యుఘ్ (అనగా మొదటి పల్లె) అని పిలిచేవారు. ఈ జిల్లలో యెరెవాన్ కు వాయువ్యంగా,హ్రజ్డాన్ నదీ ఒడ్డున ఏర్పడిన షాహుమ్యాన్ రైన్ ను కలిపారు. 1939 లో, సస్సౌన్ సాహసికులు అనే జాతీయ పురాణ కవిత 1000 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా అరాజిన్ గ్యుఘ్ గా పిలవబడుతున్న ఈ జిల్లకు దవ్తాషెన్ గా నామకరణం చేశారు.

 
సోవియట్ కాలంలోని నివాస భవనాలు

సోవియట్ యెరెవాన్ క్రమంగా అభివృద్ధి చెందుతున్న సమీపంలోని నగరశివారు, పరిసర ప్రాంతాలను యెరెవాన్ లోకి విలీనం చేశారు. హ్రజ్డాన్ నదిపై నిర్మించిన అనేక వంతెనలతో షాహుమ్యాన్ రైన్ కు నగరాన్ని అనుసంధానం చేశారు. 197లో, దవ్తాషెన్ గ్రామం అధికారికంగా రాజధాని యెరెవాన్ లో భాగం అయ్యింది.

1984 లో సోవియట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జిల్లాలోని నివాస స్థలాలకు 223 హెక్టార్ల ప్రాంతాన్ని కేటాయించారు. 1986లో సోవియట్ యెరెవాన్ పరిపాలనా విభాగాల ప్రకారం ప్రస్తుత-రోజు అజప్న్యాక్, దవ్తాషెన్ జిల్లాలు మష్టాత్స్ రైన్ లో భాగాలు. అర్మేనియాకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పరిపాలనా విభాగాల కొత్త చట్టం క్రింద 1996 లో, యెరెవాన్ ను దవ్తాషెన్ తో సహా 12 పరిపాలనా జిల్లాలుగా విభజించారు.

 
పవిత్రమైన అమరవీరుల చర్చి

2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ జిల్లాలో 42,380 (యెరెవన్ నగరం జనాభాలోని 4%) మంది నివసిస్తున్నారు. 2016 అధికారిక అంచనాల ప్రకారం, 42,500 తో నగరంలోని పన్నెండవ అత్యధిక జనాభా కలిగిన జిల్లా. అజప్న్యాక్ జనాభాలో ప్రధానంగా అర్మేనియన్ అపోస్టోలిక్ చర్చికు చెందిన వారు నివసిస్తున్నారు. కానీ 2003లో ఏర్పాటయిన పవిత్రమైన అమరవీరుల చర్చి ఒక్కటే జిల్లలో ఉంది.

 
క్రిష్టియానిటీ యొక్క 1700వ వార్షికోత్సవం సందర్భంగా నిర్మించిన కచ్కర్.   

దవ్తాషెన్ లో 1996లో లైబ్రరీ №40ను, అవెట్ టెర్తేరియన్ పేరిట ఒక కళ పాఠశాలను 1993లో ప్రారంభించారు. ఆర్మెఫిలిమ్ స్టూడియోస్, పాన్ ఆర్మేనియాకు చెందిన అర్మేనియా టి.వి. స్టేషను ఇక్కదే ఉన్నవి. రెండవ ప్రపంచ యుద్ధం, నాగోర్నో-కరబఖ్ యుద్ధం లలో వీరమరణం చెందిన ఆర్మేనియా వాసులకు గుర్తుగా ఒక స్మారక చిహ్నాన్ని దవ్తాషెన్ పార్కులో ఉంచారు. 2001లో క్రిష్టియానిటీ యొక్క 1700వ వార్షికోత్సవం సందర్భంగా కచ్కర్ కూడా ఇక్కడే నిర్మించారు.

 
దవ్తాషెన్ వంతెన

2000వ సంవత్సరంలో ప్రారంభించిన దవ్తాషెన్ వంతెన ద్వారా దవ్తాషెన్ నగరంలోని వివిధ ప్రాంతాలకు అనుసంధించబడింది.

దవ్తాషెన్ వాసులు ప్రధానంగా చిన్న, మధ్యస్థ-పరిమాణ వ్యాపారాలు చేస్తున్నరు. ఇ జిల్లా దాదాపు 300 చిన్న, మధ్యస్థ రిటైల్ దుకాణాలు, ప్రజా ఆహార, సేవల వస్తువులకు నిలయం. 1984లో ప్రారంభించిన అరాక్స్ మెటల్ నిర్మాణాల ఫ్యాక్టరీ ఇక్కడ ఉన్న పెద్ద పారిశ్రామం.

విద్యాసంవత్సరం 2016-17 నాటికి, జిల్లాలో 5 ప్రీస్కూల్ కిండర్ గార్టెన్లు, 7 ప్రభుత్వ పాఠశాలలు, 2014లో వెలసిన ఆర్మేనియన్ న్యాయశాఖ అకాడమీ ఉన్నవి.[1]

దస్త్రం:Armenian National Olympic Committee Sports complex in Yerevan (Olympavan).jpg
ఒలింపవన్

దవ్తాషెన్ అనేక క్రీడా కేంద్రాలకు నిలయం:

  • యెరెవాన్ పిల్లలు, యువత హ్యాండ్బాల్, క్రీడలు జట్టు ప్రత్యేక పాఠశాల 1993 లో ప్రారంభమైంది.
  • దవ్తాషెన్ చెస్ పాఠశాల 2013లో ప్రారంభమైంది.
  • ఒలింపవన్ ఒలింపిక్ శిక్షణా కేంద్రం, 2015లో తెరిచారు.[2]
  • ఆర్మేనియాలోని రీబాక్ స్పోర్ట్స్ క్లబ్, 2017లో ప్రారంభమైనది.[3]
 
దవ్తాషెన్ యొక్క విస్తృత దృశ్యం