దాడి గోవిందరాజులు నాయుడు


Contributors to Wikimedia projects

Article Images

దాడి గోవిందరాజులు నాయుడు (ఆగష్టు 27, 1909 - డిసెంబర్ 25, 1970) ఈయన తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి, న్యాయవాది, ఆంధ్ర నాటక కళా పరిషత్తు, ఆంధ్ర నాటక సంగీత అకాడమి సభ్యులు.

దాడి గోవిందరాజులు 1909, ఆగష్టు 27 న జన్మించారు.

ఆయన విద్యాభ్యాసం విజయవాడ, కాకినాడ, మదరాసు లలో సాగింది. 1930లో న్యాయశాస్త్రం పట్టా పుచ్చుకొని 1932లో మచిలీపట్నంలో న్యాయవాదిగా పనిచేశారు. 1941లో జిల్లా మునిసిఫ్ గా నియమితులై జిల్లా న్యాయాధికారిగా ఉద్యోగ విరమణ చేశారు.

మదరాసులో మార్కండేయ (తమిళం) లో మార్కండేయ పాత్రతో నాటకరంగంలోకి ప్రవేశించారు. తరువాత మదరాసులోని ‘షేక్ప్సియర్ అమెచ్చూర్స, విజయవాడ ‘నాట్యగోష్టి‘ నాటక సంస్థలో, ఏలూరు అమెచ్యూర్, బందరు నేషనల్ థియేటర్, హిందూ డ్రమటిక్ కంపెనీ, మొదలైన నాటక సమాజాలు ప్రదర్శించిన నాటకాలలోనే కాకుండా, బళ్లారి రాఘవ పక్కన నటించి అందరి మొప్పుపొందారు.

తెలుగు: ప్రహ్లాదుడు, మధురవాణి, తిష్యరక్షిత, కైక, సత్య, సీత, భ్రమరాంబ, కమలాంబ, రోషనార, ఆఫ్రియా, సుందరి, జానకి, వసంతసేన, శ్రీకృష్ణ దేవరాయలు మొ.నవి

ఇంగ్లీష్: పోర్షియా, బ్రూటస్, లేడీ మాక్బెత్, డెస్డిమోనా, ఒపీలియా, జూలియట్ మొ.నవి

ఈయన 1970, డిసెంబర్ 25 న మరణించారు.

  • దాడి గోవిందరాజులు నాయుడు, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 297.