నరకాసుర విజయవ్యాయోగం


Contributors to Wikimedia projects

Article Images

నరకాసుర విజయవ్యాయోగం


నరకాసుర విజయవ్యాయోగం 1871లో కొక్కొండ వెంకటరత్నం పంతులు రాసిన సంస్కృత నాటక (రూపక) అనువాదం.[1] ఇది 1872లో ముద్రాణావకాశం పొంది, లభ్యమైన వాటిలో తొలి సంస్కృత రూపకాంధ్రీకరణము. శ్రీకృష్ణుడు సత్యభామ యుద్ధంచేసి నరకాసురుని వధించి విజయం పొందిన ఇతివృత్తాన్ని నరకాసుర విజయ వ్యాయోగము కథగా తీసుకున్నారు. వారణాసి ధర్మసూరి సంస్కృత రచనను వేంకటరత్నం పంతులు తెలుగులోకి అనువదించారు.

నరకాసుర విజయవ్యాయోగం
నరకాసుర విజయవ్యాయోగం పుస్తక ముఖచిత్రం
కృతికర్త: ధర్మసూరి
అసలు పేరు (తెలుగులో లేకపోతే): నరకాసుర విజయవ్యాయోగం
అనువాదకులు: కొక్కొండ వెంకటరత్నం పంతులు
దేశం: భారతదేశం
భాష: తెలుగు (మూలం:సంస్కృతం)
ప్రక్రియ: నాటకం
ప్రచురణ: వావిళ్ల రామశాస్త్రి అండ్ సన్స్
విడుదల: 1950
పేజీలు: 112

సంస్కృత నాటకాలను అనువదించడంలో పద్యానికి పద్యం, గద్యానికి గద్యం వరుసగా వ్రాసే పద్ధతిని 1872లో కొక్కొండ వెంకటరత్నం ఏర్పరిచాడు. ఈరోజుకు కాడా అందరు కవులు ఇదే పద్ధతిని వాడుతున్నారు. అర్థమేకాకుండా శబ్ధంకూడా తేడారాకుండా దీని అనువాదంలో జాగ్రత్తపడ్డారు. పద్యగద్యంలో అక్కడక్కడ కొన్ని భాగాలు సులభశైలిలో ఉన్నాయి. మూలంలోని భావం తెలుగోల ఒక పద్యంలో సరిపడకపోతే వేరొక పద్యంలో కూడా దాని భావం వచ్చేలా రాయడమేకాకుండా, కొన్నిచోట్ల ఒక పాదం ఎక్కువగా రాశారు.

  1. నరకాసుర విజయవ్యాయోగం, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 198.

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని నాటక ప్రతి