పుట్టిన రోజు


Contributors to Wikimedia projects

Article Images

పుట్టిన రోజు

పుట్టిన రోజు ను జన్మదినం, జయంతి అని కూడా అంటారు. ఇంగ్లీషులో Birthday అంటారు. ఈ పుట్టిన రోజున జరుపుకునే ఉత్సవాన్ని జన్మ దినోత్సవం అంటారు. ఒక సంవత్సరం పూర్తయి తరువాత సంత్సరంలో అడుగు పెట్టె సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ పుట్టిన రోజున కొత్త బట్టలు ధరించడం,చుట్టూ దీపాలు వెలిగించిన కేకును కోసి తోటి వారికి పంచడం వంటివి చేస్తుంటారు. సంస్థలకు కూడా ఇదే విధంగా పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తారు. దేవతలకు కూడా వారి పుట్టిన రోజున జయంతోత్సవాలు నిర్వహిస్తారు. విద్యార్థులు తమ పుట్టిన రోజు నాడు తోటి విద్యార్థులకు, స్నేహితులకు, ఉపాధ్యాయులకు, బంధువులకు మిఠాయిలు పంచి పెడతారు, వారి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు పొందుతారు, తల్లిదండ్రులు నుంచి ఇంకా ఆప్తులైన పెద్దల నుంచి ఆశీస్సులు పొందుతారు. కొందరు వ్యక్తులు మరణించినప్పటికి వారి సేవలను స్మరించుకుంటూ వారి జన్మదినోత్సవాలను జరుపుకుంటారు, వారు ఇప్పటికి బతికి ఉంటే వారి వయసు ఇంత ఉండేదని అన్నోవ జయంతోత్సవముగా జరుపుకుంటారు. ఉదాహరణకు తాళ్ళపాక అన్నమాచార్య 601వ జయంతి ఉత్సవాలు. పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుని 601వ జయంతిని పురస్కరించుకొని తెలుగుజాతి ఆయనకిచ్చిన ఘన నివాళి లక్షగళ సంకీర్తనార్చన. ఇది సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సుమారు లక్షా అరవై వేల మంది తన్మయత్మంతో ఏకకంఠంతో అన్నమాచార్యుని సప్తగిరి సంకీర్తనలను గానం చేసిన అపూర్వమైన సంఘటన.

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ HAPPY BIRTHDAY అనే అక్షరాలతో ఉన్న కొవ్వొత్తులను వెలిగించిన చిత్రం
యుఎస్ సాంప్రదాయంగా పుట్టినరోజు టోపీని ధరించిన చిన్న అమ్మాయి