పౌడీ గఢ్వాల్ జిల్లా


Contributors to Wikimedia projects

Article Images

పౌడీ గఢ్వాల్, భారతదేశం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఈ జిల్లాకు పౌడీ కేంద్రంగా ఉంది. పౌడీ గఢ్వాల్ సమీపంలో హరిద్వార్, డెహ్రాడూన్, తెహ్రి గఢ్వాల్, రుద్రప్రయాగ్, చమోలి, అల్మోరా, నైనీతాల్ ఉన్నాయి. పౌడీ గఢ్వాల్ దక్షిణ సరిహద్దులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్ జిల్లా ఉది. ఈ జిల్లాలో కొంతభాగం గంగా మైదానంలో ఉంది. మిగులిన భాగం ఉత్తరంగా హిమాలయాలలో ఉంది.

Pauri Garhwal district

पौड़ी गढ़वाल

district

Devprayag in Pauri Garhwal

Devprayag in Pauri Garhwal

Country India
రాష్ట్రంUttarakhand
DivisionGarhwal
ప్రధాన కార్యాలయంPauri
విస్తీర్ణం
 • Total5,399 కి.మీ2 (2,085 చ. మై)
జనాభా
 • Total6,97,078
 • జనసాంద్రత129/కి.మీ2 (330/చ. మై.)
భాషలు
 • అధికారHindi
Time zoneUTC+5:30 (IST)

పాల్ షాహి పాలించిన గఢ్వాల్ సామ్రాజ్యంలో పౌడీ గఢ్వాల్ ఒకభాగం. ఈ సంరాజ్యానికి శ్రీనగర్ రాజధానిగా ఉంటూ వచ్చింది. 1803లో గొర్కాలు అసఫలమైన పలు దాడులు సాగించిన తరువాత చివరికి రాజా ప్రద్యుమ్న సైన్యాలతో భీకరంగా పోరుసలిపి అతడిని ఓడించి గఢ్వాల్ సామ్రాజ్యాన్ని వశపరచుకున్నారు. 1806లో బ్రిటిష్ సైన్యం ఆంగ్లో నేపాలీ యుద్ధంల్.ఒ గొర్కాలను ఓడించిన తరువాత గఢ్వాల్ సామ్రాజ్యం తెహ్రీగా పునస్థాపితం చేయబడింది.

భారతదేశ ఉపఖండానికి సమకాలీనంగా పౌరీగఢ్వాల్ ప్రాంతంలో కూడా మానవనివాసాలు ఆరంభమైయాయని భావించబడుతుంది. చారిత్రకంగా మొదటి సామ్రాజ్యమైన కాట్యూరి సామ్రాజ్యంలో సమైక్య ఉత్తరాఖండ్‌ ప్రాంతం అంతర్భాగంగా ఉండేది. కాట్యూరీ సామ్రాజ్యానికి చెందిన శిలాశాసనాలు, ఆలయాల ఆధారంగా కొంత సమాచారం అందుబాటులో ఉంది. కాత్యూరీల పతనం తరువాత గఢ్వాల్ ప్రాంతం 64 కంటే అధికమైన భాగాలుగా విభజించబడి వాటికి సామంతులను పాలకుగా నియమించారు. రాజా కనకపాల్ వారసుడైన రాజా జగత్‌పాల్ (సా.శ.1455 - సా.శ.1493) పాలనలో సా.శ. 15 వ శతాబ్ధపు మద్య కాలానికి చంద్పుర్‌ఘర్ సామంతరాజులలో శక్తివంతుడుగా గుర్తింపు పొందాడు. సా.శ. 15వ శతాబ్ధపు చివరినాటికి రాజా అజయ్‌పాల్ చంద్పుర్‌ఘర్‌ను ఓడించి ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకువచ్చాడు. ఆయన పాలించిన ప్రాంతమే గఢ్వాల్. సా.శ. 1506కు ముందు ఆయన తన రాజధానిని చంద్పూరు నుండి దేవల్ఘర్‌కు మార్చాడు. సా.శ.1506-1519 వరకు రాజధానిగా శ్రీనగర్ చేయబడింది.

రాజా అజయ్‌పాల్, ఆయన వారసులు దాదాపు 300 సంవత్సరాల కాలం గఢ్వాల్‌ను పాలించారు. ఈ పాలనా కాలంలో వారు కుమోన్, మొగల్స్, సిక్కులు, రొహిల్లాల దాడులను ఎదుర్కొన్నారు. పౌడీ గఢ్వాల్ చరిత్రలో అతి ముఖ్యమైన సంఘటనలలో ఒకటి గోర్కాల దాడి అని భావించవచ్చు. ఈ దాడిలో హింస శిఖరాగ్రాలను చేరింది. గోర్కాలు కుమాన్ అరియు దోతి జయించిన తరువాత శక్తివంతమైన ప్రతిఘటనల మద్య గఢ్వాల్ మీద దాడి చేసారు. మద్యలో వారికి చైనీయుల దాడి సమాచారం అందింది. అందువలన గోర్కాలు దాడిని ఆపవలసి వచ్చింది. అయినప్పటికీ 1803లో గోర్కాలు తిరిగి గఢ్వాల్ మీద దాడి చేసారు. కుమాన్‌ను స్వాధీనం చేదుకున్న తరువాత గోర్కాలు గఢ్వాల్ మీద 3 మార్లు దాడి చేసి చివరికి 1804లో గోర్కాలు గఢ్వాల్‌ను స్వాధీనం చేసుకుని 12 సంవత్సరాల కాలం పాలించారు.

1815లో గఢ్వాల్ ప్రాంతం మీద బ్రిటిష్ సైన్యాలు దాడి చెయ్యడంతో గోర్కాల పాలన ముగింపుకు వచ్చింది. 1875 ఏప్రిల్ 21న బ్రిటిష్ సైన్యాలు గోర్కాలను జయించి బ్రిటిష్ ప్రభుత్వం తూర్పు భూభాగం మీద దృష్టి కేంద్రీకరించి అలకనందా, మందాకినీ నదీ తీరాలలోని గఢ్వాల్ లోని కొంతభాగం స్వాధీనం చేసుకున్నది. మిగిలిన పడమటి గఢ్వాల్ ప్రాంతం రాజా సుదర్శన్ షాహ్ పాలనలో ఉండిపోయింది. తరువాత సుదర్శన్ షాహ్ తెహ్రీని తనరాజధానిగా చేసుకుని పాలన కొనసాగించాడు. మొదట నైనీతాల్ను ప్రధాన కార్యాలయంగా చేసుకుని కుమాన్, గఢ్వాల్ పాలనా బాధ్యతలను కమీషనర్ ఆఫ్ కుమాన్ అండ్ ఘర్వాలుకు అప్పగించారు. తరువాత 1840లో గఢ్వాల్ వేరుచేయబడి పౌరీ ప్రధాన కేంద్రంగా ప్రత్యేక జిల్లాగా రూపొందించబడింది. 1960లో గఢ్వాల్ జిల్లా నుండి చమోలి, పౌడీ గఢ్వాల్ జిల్లాలు రూపుదిద్దుకొనబడ్డాయి. ప్రస్తుతం లామాఖెట్ (పితోరాఘర్) రాజా మహేంద్ర చంద్ రినాకు చెందిన రాణిగీతాను వివాహం చేసుకున్నాడు.

స్వాతంత్ర్యం తరువాత 1960లో గర్హ్వాల్ జిల్లా అదనంగా పౌడీ గఢ్వాల్, చమోలి జిల్లాలుగా విభజించబడ్డాయి. 1997లో కలుపుకుని తెహ్రీ గఢ్వాల్, చమోలీ జిల్లాల నుండి అదనపు భుభాగాలను పౌడీ గఢ్వాల్ సేకరించి రుద్రప్రయాగ జిల్లా రూపొందించబడింది. పౌరీలో ఉన్న రాణి గ్రౌండ్ ఆసియాలో ఎత్తైన గ్రౌండుగా ప్రత్యేక గుర్తింపు పొందింది. పౌడీ గఢ్వాల్ 29° 45’ to 30°15’ అక్షాంశ, 78° 24’ నుండి 79° 23’ రేఖాంశాల మద్య ఉపస్థితమై ఉంది. జిల్లాను పాలనాపరంగా తొమ్మిది తాలుకాలు, పదిహేను అభివృద్ధి బ్లాక్స్ ఉప విభాగాలుగా విభజించబడింది.[1]

పూరీ, లాంస్‌డౌన్, కొత్వార్, తలిసియన్, దుమాకోట్, శ్రీనగర్, సాగ్పులి, చౌబట్టా ఖల్, యంకేశ్వర్.

కోట్, కలిజిఖాల్ ( పౌరీ గర్హ్వాల్ అతిపెద్ద బ్లాక్ ), పూరీ, పోప్ల, తలిసియన్, బిరోఖల్, ద్వారిఖల్, దుగడ్డ, జైహ్రిఖల్, ఏకేశ్వర్, రిఖ్నిఖల్, యంకేశ్వర్, నైనిదండా, పోఖ్రా, ఖిర్స్.

పౌడీ గఢ్వాల్ వాతావరణం శీతాకాలం, వేసవికాలాంలో సైతం ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాకాలంలో వతావరణం పూర్తిగా పచ్చదనం నిండి ఉంటుంది. అయినప్పటికీ కొత్వార్, దానిని ఆనుకుని ఉన్న భాబర్ ప్రాంతంలో వేసవి ఉష్ణోగ్రత 40 సెల్షియస్‌కు చేరుకుంటుంది. శీతాకాలంలో మాత్రం పౌరీ జిల్లాలోని అత్యధిక భాగం హిమపాతం సంభవిస్తూ ఉంటుంది.

జిల్లా ప్రజలలో అత్యధికులు సాధారణంగా బాడుగ టాక్సీలలో ప్రయాణిస్తుంటారు. ఉత్తరాఖండ్ రోడ్వేస్ గఢ్వాల్ మోటర్ ఓనర్ యూనియన్ (జి.ఎం.ఒ.యు), గఢ్వాల్ మండలం వికాస్ నిగం (జి.ఎం.వి.ఎన్) లిమిటెడ్ బసు వసతి కలిగిస్తుంది. ఉత్తారాఖండ్ ప్రభుత్వం జిల్లా లోపలి మార్గాలు, ప్రధాన పట్టణాలకు మితమైన రోడ్డు మార్గాలను మాత్రమే నిర్వహిస్తుంది. గి.ఎం.యు సర్వీసులు కుమాన్, పరిసర ప్రాంతాలలో మితమైన బసు సర్వీసులను నిర్వహిస్తుంది. అంతేకాక జిల్లాలోని పలు పట్టణాలలో అనేక టాక్సీ యూనియన్లు ఉన్నాయి. ఇవి జిల్లాలోని మారుమూలకు కూడా ప్రయాణ వసతులు కల్పిస్తున్నాయి. జిల్లాలో ఉన్న ఒకే ఒక రైల్వే స్టేషను కొత్వారాలో ఉంది. 1889లో బ్రిటిష్ వారి చేత స్థాపించబడింది. పౌడీ గఢ్వాల్ జిల్లా శివాలిక్ పర్వతశ్రేణులు, హిమాలయాలలోని చివరి పర్వతశ్రేణులలో ఉంది. ఈ కొండలు చాలా సున్నితమైనవి కనుక ఇక్కడ రైలుమార్గ నిర్మాణం క్షేమకరం కాదు. పౌడీ గఢ్వాల్‌కు క్రమానుగతమైన విమానసర్వీసులు లేవు. సమీపంలో ఉన్న ఒకేఒక విమానాశ్రయం పౌరీకి 15 కి.మీ, కొత్వాడా నుండి 120 కి.మీ దూరంలో డెహ్రాడూన్‌లో ఉన్న " జాలీగ్రాంటు " మాత్రమే.

పౌడీ గఢ్వాల్ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. కొన్ని చిన్న, పెద్ద పారిశ్రామిక యూనిట్లు కొత్వాడా సమీపంలో స్థాపినచబడ్డాయి. వీటిలో సిధ్బలి స్టీల్స్, విప్రో, బంజోష్, సింప్లెక్స్ ఫార్మా, ఎస్.ఆర్ ఆయుర్వేద మొదలైనవి ప్రధానమైనవి. పారామిలిటరీ శిక్షణా కేంద్రాలు యువతకు ఉపాధి కల్పించే ప్రధాన వనరులలో ఒకటిగా భావించబడుతుంది. భౌగోళిక పరిస్థితులు, మౌలిక వసతులు కొరత కారణంగా జిల్లాలోని కొండప్రాంతాలలో బృహత్తర పరిశ్రమల స్థాపనకు అవకాశం లేదు. పౌడీ గఢ్వాల్ జిల్లా లోని సిగడ్డి వద్ద బంజోష్ గ్రూప్ పుట్టగొడుగుల పెంపకం చేపట్టింది. ఈ సంస్థ సంవత్సరానికి 700 మెట్రిక్ టన్నుల పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తుంది.

పౌడీ గఢ్వాల్ జిల్లాలో పలు ప్రటకఆకర్షణ ప్రాంతాలున్నాయి. ప్రకృతి సహజ స్వర్గసీమవంటి పౌడీ గఢ్వాల్ పర్యాటకులను సౌందర్యంతో మంత్రముగ్ధుకను చేస్తుంది. అందమైన లోయలు ఎత్తైన మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు చూపరులను ఆకర్షిస్తాయి. అంతేకాక పౌడీ గఢ్వాల్‌లో పురాతన ఆలయాలుకూడా ఉన్నాయి.

గఢ్వాల్ ప్రజల మద్య దండనాగరాజ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కండవాస్యూన్ పట్టిలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించడానికి దేశం అంతటి నుండి పలువురు యాత్రికులు వస్తుంటారు. ఘర్వాలి భాషలో దండ అంటే అడవి కనుక ఈ ఆలయానికీ పేరు వచ్చింది. ఈ ఆలయం ఇప్పటికీ అరణ్యంలో ఉంది కనుక ప్రజలు ఇక్కడి స్వామిని " దండ నాగరాజు (అడవి నాగరాజు) అని పిలుస్తుంటారు.

శ్రీకృష్ణుడు ఇక్కడకు పాము రూపంలో వచ్చి పాకుతూ ఇప్పుడు ఆలయం ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడని భావిస్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఇక్కడ శతాబ్దాలుగా నిలిచి ఉన్నాడని ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. వారు దండ నాగారాజు ఆశీర్వాదాలు అందుకుంటూ ఉన్నారని ఇక్కడి ప్రజలు విశ్వాసంతో చెప్తుంటారు. దండనాగారజు తమకు వచ్చే ఆపదలను తొలగిస్తాడని, ఆపదలు వచ్చే ముందే హెచ్చరించి పరిష్కార మార్గాలు కూడా సూచిస్తాడని ప్రజల ఘాడవిశ్వాసం. దండనాగరాజును పరిపూర్ణవిశ్వాసంతో కోరుకున్న కోరికలు నెరవేరతాయని ఆలయపూజారి తెలియజేస్తున్నాడు.

ఈ ఆలయం శీఖరాగంలో ఉంది. భక్తులు సేదతీరడానికి చుట్టూ చక్కని వాతావరణం నెలకొని ఉంది. భక్తులు తమకోరిక తీరిన తరువాత సమర్పించిన గంటలు అనేకం ఆలయఆవరణలో కట్టి ఉండడం ఆలయ ప్రతేకతలలో ఒకటి. అంతేకాక భక్తులు దైవానికి నివేదించే బెల్లం ప్రసాదంగా పంచుతుంటారు. భక్తులు దైవాన్ని దర్శించి ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక్కడకు దేశీయంగానే కాక యు.కె, యు.ఎస్ నుండి వచ్చిన భక్తులు దైవాన్ని దర్శించి వారిపేరుతో గంటలను కడుతుంటారని పూజారి వివరిస్తుంటాడు. ఇక్కడి గ్రామాలలో నివసించే ప్రజలు దండనాగరాజు అంటే పవిత్ర భక్తివిశ్వాసాలు కలిగి ఉన్నారు. ప్రజలు ఇక్కడ వెలిసిన దైవాన్ని గురించి విభిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రజలకు దైవానికి యుగయుగాలుగా ఉన్న ఈ అనుబంధం కారణంగా పౌరీ ఘర్వాలుకు అద్భుతాల భూమి అనే పేరుకూడా ఉంది.

కొత్వారా, పౌరీల నుండి బసుల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. అయినప్పటికీ బసులు లభించడం అరుదు. ఒకరోజుకు రెండుమార్లు మాత్రమే లభిస్తాయి కనుక యాత్రీకులు బాడుగ ట్క్సీలలో ఇక్కడకు చేరుకోవచ్చు. దండనాగరాజు ఆలయం కొత్వాడా నుండి 90కి.మీ, సాత్పులి నుండి 35కి.మీ, పౌరీ నుండి 35 కి.మీ దూరంలో ఉంది.

జ్వల్పాదేవికి అనికితమైన ప్రముఖశక్తి పీఠాలలో జ్వల్పాదేవి ఆలయం ఒకటి. ఇది నవలికా నదీ (గాదన్) తీరంలో ఉంది. ఇది పౌరీ నుండి 34కి.మీ దూరంలో ఉంది. స్కంద పురాణం ఆధారంగా సచీదేవి ఇంద్రుని వివాహం చేసుకోవాలని కోరి శక్తిని ఇక్కడ పూజించిందని తెలుస్తుంది. శచీదేవికి శక్తి దీప్తివంతమైన జ్వాలేశ్వరిగా దర్శనం ఇచ్చి శచీదేవి కోరిక తీరే వరమిచ్చింది. జ్వాలేశ్వరి క్రమంగా జ్వాల్పాదేవిగా మారింది. జగద్గురువు శంకరాచార్యుడు ఇక్కడకు వచ్చి దేవిని ప్రార్థించిన సమయంలో ఆయనకు ఇక్కడ దేవి దర్శనం ఇచ్చిందని కథనాలు వివరిస్తున్నాయి. ఈ ఆలయంలో చిత్రా, శరత్‌నవరాత్రఉలలో రెండుమార్లు నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఆలయానికి అంత్వాల్స్ వంశపారంపర్య పూజారులుగా సంరక్షకులుగా ఉన్నారు. ప్రస్తుత ఆలయాన్ని అనేత్ జమీందారు అయిన కీ.శే శ్రీ దత్తరాం అంత్వాల్ నిర్మించాడని తెలుస్తుని. ప్రతిసంవత్సరం ఈ ఆలయాన్ని వేలాది భక్తులు దర్శిస్తుంటారు. కన్యలు ఈ ఆలాఅన్ని దర్శిస్తే శక్తి దయతో స్వర్గాధిపతి ఇంద్రుని వంటి భర్త లభిస్తాడని భక్తులు విశ్వసిస్తున్నారు.

 
Kandoliya

ఈ ఆలయ ప్రధానదేవత కండోలియా. ఇందులో లక్ష్మీనారాయణులు, క్యుంకళేశ్వర మహాదేవ్, హనుమాన్ ఉపాలయాలు ఉన్నాయి. కండొలియా దేవి ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం జరిగే బంద్రా ఉత్సవాలకు వేలాది భక్తులు పౌరీ, సమీప గ్రామాల నుండి విచ్చేస్తుంటారు. ఈ నగరం పలు విహారప్రదేశాలను కలిగి ఆహ్లాదంగా ఉంటుంది. సహజ సౌందర్యం కలిగిన దియోదర్ అడవులు, రాంసి, కండోలియా, నాగ్ దేవ్, ఝండి ధర్ మొదలైనవి వాటిలో ప్రముఖమైనవి. 1974 నుండి ఇక్కడ ప్రతిసంవత్సరం శారదోత్సవాలు నిర్వహించబడుతునాయి.

కొత్వాడా సమీపంలో ఉన్న ప్రముఖ అధ్యాత్మిక కేంద్రాలలో శూన్య శిఖరాలయం ఒకటి. ఇక్కడకు చేరుకోవడానికి కొత్వాడా నుండి 7 కి.మీ పర్వతారోహణ చేయాలి. కొత్వాడా సమీపంలో ఉన్న ఈ పర్వతప్రదేశం 35 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. శూన్య శిఖరాలయంలో ఉన్న " సద్గురుసదాఫాల్డియో జీ మహరాజ్ "ధ్యానగుహ పర్యాటకుల గుర్తింపు పొందింది. శూన్య శిఖరాలయం ప్రపంచం అనటాఉన్న పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఇక్కడ ప్రత్యేకంగా " విహంగం యోగ " అంతర్జాతీయ అత్యున్నత ధ్యానప్రక్రియను కోరుకుంటున్న పర్యాటకులను ఆకర్షిస్తుంది.[2]

పౌరీ నగర సరిహద్దులలో మంచుకప్పిన హిమాలయశిఖరాలలో ఉన్న శివాలయమిది. ఈ ఆలయంలో శివుడు ప్రధానదైవంగా ఉన్నాడు. శివునితో పార్వతి, గణపతి, కార్తికేయుడు కూడా ఉపస్థితులై ఉన్నారు.

పౌరీ నుండి 4 కి.మీ దూరంలో ఉన్న " చౌకంబ దృశ్యకేంద్రం " నుండి అద్భుత సౌందర్యవంతమైన చౌకంబా శిఖరాలను, ఇద్వాల్ లోయలను తిలకించవచ్చు. మనోహరమైన దృశ్యాలు కలిగిన పౌరీ నగరంలో ఇది ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది.

 
Khirsu Park

మంచుతో కప్పబడిన పర్వతాలతో కిర్సు మనోహరమైన సమగ్రదృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. మద్య హిమాలయాలలో అద్భుత దృశ్యాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రదేశాలలో ఇది ప్రముఖమైనది. ఇక్కడి నుండి చూస్తే చుట్టూ ప్రముఖ, అనామక పలు పర్వతశుఖరాలను చూడవచ్చు. పౌరీ నగరానికి 19 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రదేశం సముద్రమట్టానికి 1, 700 మీటర్ల ఎత్తున ఉంది. కిర్సులో ప్రశాంతమైన, పరిశుభ్రమైన వాతావరణం నెలకొని ఉంది. ఇక్కడ పక్షులను, ఓక్, దేవదారు చెట్లు, ఆఫిల్ తోటలను చూడవచ్చు. పురాతనమైన ఘండియాల్ దేవత ఆలయాన్ని ఇక్కడి నుండి చూడచ్చు. టూరిస్ట్ రెస్ట్ హౌస్, ఫారెస్ట్ హౌస్‌లలో యాత్రికులకు వసతి సౌకర్యాలు లభిస్తాయి.

లాంస్‌డోన్ నుండి 36కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయం 1, 800 మీటర్ల ఎత్తులో ఉంది. తారకేశ్వర్ మహాదేవ్ ఆలయ ప్రధాన దైవం శివుడు. ఆలయ పరిసరాలు దేవదారు, పైన్ చెట్లతో దట్టమౌన అడవులతో నిండి ఉంది. ప్రకృతి ఆరాధకులకు ఇది ముఖ్యమైన ప్రదేశమని చెప్పవచ్చు. శివరాత్రి, మే మాసంలో ఈ ఆలయంలో ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి. భక్తులకు ఆలయకమిటీ ధర్మశాలలో వసతి సౌకర్యాలు కల్పిస్తుంది. తారకేశ్వర్ ఆలయం చకులియాకల్ నుండి 5కి.మీ, రిఖ్నిఖల్ నుండి 20 కి.మీ దూరంలో ఉంది.

సాత్పులి నుండి 20కి.మీ దూరంలో ఉన్న ఏకేశ్వర్ మహాదేవ్ ఆలయం సముద్రమట్టానికి 1, 820 కి.మీ దూరంలో ఉంది. ఆలయ ప్రధానదైవం శివుడు. అద్భుత సౌందర్యం, ప్రశాంత వాతావరణం ప్రకృతి ఆరాధకులను విశేషంగా ఆకర్షిస్తుంది. శివరాత్రి రోజున ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. సాత్పులి, ఏకేశ్వరాలయ మార్గంలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూడవచ్చు. మంచుతో కప్పబడిన చౌఖ్మంబ శిఖరాలను ఇక్కడి నుండి చూడవచ్చు.

బిర్చ్, రోడోడెండ్రాన్, దేవదారు వృక్షాల వృక్షాలతో నిండిన దట్టమైన అడవుల మద్య నెలవై ఉన్న బింసర్ మహాదేవ్ ఆలయం సముద్రమట్టానికి 2, 480 మీ ఎత్తున పౌరీకి 14 కి.మీ దూరంలో ఉంది. ఆలయంలో హరుడు గౌరీ, గణేశుడు, మహిషాసుర మర్ధిని ప్రధానదైవాలుగా ఉన్నారు. పృధుమహారాజు తనతండ్రి అయిన బిందు ఙాపకార్ధం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు విశ్వసించబడుతుంది. ఈ ఆలయాన్ని బిండేశ్వర్ ఆలయం అని కూడా అంటారు. ప్రతిసంవత్సరం వైకుంఠ్ చతుర్ధశి నాడు ఈ ఆలయంలో ప్రత్యేకపూజలు ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి. బింసర్ మహాదేవ్ ఆలయం తలిసియన్ నుండి 24 కి.మీ దూరంలో ఉంది.

దూద్‌హటీలీ సముద్రమట్టానికి 3, 100 మీ ఎత్తున దట్టమైన అడవుల మద్య ఉపస్థితమై ఉంది. దూద్‌హటీలీ 24 కి.మీ దూరంలో తలిసియన్, 104 కి.మీ దూరంలో పౌరీలు ఉన్నాయి. దూద్‌హటీలీ చేరుకోవడానికి 24 కి.మీ పర్వతారోహణ చేయాలి. ఇక్కడి నుండి సుందరమైన హిమాలయ పర్వతావళి, పరిసరప్రాంతాల సమగ్రదృశ్యాలను చూడవచ్చు.

తారాకుండ్ సముద్రమట్టానికి 2, 200 మీ ఎత్తున ఉంది. తారాకుండ్ పర్యాటక ఆకర్షణ కలిగిన సుందరమైన ప్రదేశం. తారాకుండ్ సరసుతో కూడిన ఒక చిన్న పురాతన ఆలయం. ఈ ఆలయంలోని ప్రధానదైవానికి తేజ్ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఉత్సవసమయంలో భక్తులు దైవాన్ని ఆరాధించి మొక్కులు చెల్లిస్తుంటారు. తారాకుండ్ పల్లి గ్రామానికి 8 కి.మీల దూరంలో ఉంది. ఈ ఆలయ ప్రధాన దైవం అయిన శువునికి శివరాత్రి రోజున ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు పరిసర ప్రజలు అధికంగా విచ్చేస్తుంటారు.

కణ్వాశ్రమం కొత్వాడా నుండి 14 కి.మీ దూరంలో ఉంది. విశ్వామిత్రుడు తపసు చేసిన ప్రదేశమిది. విశ్వామిత్రుని తపసుకు భయపడిన ఇంద్రుడు అర్సర మేనకను పంపి తపోభంగం చేసిన ప్రదేశం కూడా ఇదే అని విశ్వసించబడుతుంది. ఇది చారిత్రక, పురాతత్వ పరిశోధనలకు ముఖ్యమైన ప్రదేశంగా భావించబడుతుంది. విశ్వమిత్రుని తపోభంగం చేసిన మేనక అతని ద్వారా ఒక కుమార్తెను ప్రసవించింది. ఆమె ఆ కుమార్తెను అక్కడే వదిలి పోగా కణ్వమహర్షి ఆ కుమార్తెకు శకుంతల అని నామకరణం చేసి తన కుమార్తెగా పెంచాడు. శకుంతల తరువాత హస్థిపుర మహారాజైన దుష్యంతుడిని వివాహం చేసుకుని భరతుడికి జన్మ ఇచ్చింది. భరతుడి పేరు మీదనే ఇండియాకు భరతవర్ష అనే పేరు వచ్చింది. కణ్వాశ్రమం ఇతర ముఖ్యమైన ప్రదేశాలతో రహదారి మార్గం ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. ఇక్కడికి 14 కి.మీ దూరంలో ఉన్న కొత్వాడా నుండి రైలువసతి కూడా లభ్యమౌతూ ఉంది. సమీపంలో ఉన్న విమానాశ్రయం జాలీగ్రాంటు (డెహ్రాడూన్) . కణ్వాశ్రమంలో పర్యాటకులకు పలువిధ సౌకర్యాలను కలిగిస్తుంది. ఇక్కడి నుండి చిన్నవి పెద్దవి అయిన పర్వతారోహణ మార్గాలు ఉన్నాయి. ఇక్కడి నుండి పర్యాటకులు ఒక గంట ప్రయాణించి సుందరమైన సహస్రధారా జలపాతాన్ని చేరుకోవచ్చు. అలా నడవలేని వారు స్వల్పమైన నడకదారిలో సమీపంలో ఉన్న మాలిని వంతెనను చేరుకోవడం ఒక మరువలేని అనుభూతిగా చెప్పవచ్చు. ఇక్కడ బాలలకు సంప్రదాయ విద్యగరపడానికి ఒక గురుకులం ఉంది. అంతేకాక ఇక్కడ పర్యాటకులకు యోగా క్లాసులు, ఆయుర్వేద చికిత్స సౌకర్యాలు ఉన్నాయి. సౌకర్యవంతమైన వసతులు కలిగిన ఈ ఆశ్రమంలో విద్యను అభ్యసించే విద్యార్థులు ధైర్యవంతులు, సంస్కారవంతులు ఔతారని విశ్వసిస్తున్నారు.

ఇక్కడకు 14 కి.మీ దూరంలో కొత్వాడాతో కణశ్రమం రహదారి మార్గంతో చక్కగా అనుసంధానించబడి ఉంది. కొత్వాడా నుండి రైలు మార్గం కూడా ఉంది. సమీపంలోని విమానాశ్రయం జాలీగ్రాంటు ( డెహ్రాడూన్) .

  • Pine Forest Kandoliya Pauri

  • Khirsu

  1. "District at Present: District Pauri Garhwal , Uttarakhand, India". web.archive.org. 2014-04-28. Archived from the original on 2014-04-28. Retrieved 2023-06-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Swarved". web.archive.org. 2012-03-17. Archived from the original on 2012-03-17. Retrieved 2023-06-16.