రైనోవైరస్


Contributors to Wikimedia projects

Article Images

రైనోవైరస్

రైనోవైరస్ సర్వసాధారణంగా కనిపించే ఒక వైరస్. జలుబును కలుగజేసే వైరస్ లలో ఇది ప్రధానమైనది. ఇది ముక్కులో ఉండే 33-35 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఇది పికోర్నావైరస్ (Picornavirus) అనే జాతికి చెందినది. దీని ఉపరితల ప్రోటీన్లను బట్టి సుమారు 99 రకాలు గుర్తించారు. ఇవి సుమారు 30 నానో మీటర్ల పరిమాణం కలిగిన అతి చిన్న వైరస్ లు. దీనితో పోలిస్తే స్మాల్ఫాక్స్, వ్యాక్సీనియా మొదలైన వైరస్ లతో పోలిస్తే ఇది సుమారు 10 రెట్లు చిన్నది.

"మానవ రైనోవైరస్"
మానవ రైనోవైరస్ యొక్క కణ ఉపరితలం, ప్రోటీన్ చారలను చూడవచ్చు.
Virus classification
Group:

Group IV ((+)ssRNA)

Order:

పైకార్నవైరలెస్

Family:

పైకార్నవైరైడే

Genus:

ఎంటర్‌వైరస్

Species
  • రైనోవైరస్ A
  • రైనోవైరస్ B
  • రైనోవైరస్ C

ఇటీవల నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఆసక్తికరమైన విషయం తేలింది. చల్లగా ఉండే వాతావరణంలో మనకు జలుబును కలిగించే రైనోవైరస్ చాలా తొందరగా పెరుగుతుంది. మన శ్వాసమార్గాల్లో మరింత సులువుగా, వేగంగా పునరుత్పత్తి చెందుతుందని ఈ పరిశోధన స్పష్టం చేస్తున్నది.

అంతేగాక చల్లని వాతావరణంలో మన వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా బలహీనంగా ఉంటుంది. తద్వారా వైరస్ చాలా సులభంగా లోపలికి ప్రవేశించగలుగుతుంది. ఎలుకలోని శ్వాసమార్గాల నుంచి సేకరించిన కణాలను సాధారణ శరీర ఉష్ణోగ్రత, ఊపిరితిత్తుల ఉష్ణోగ్రత (37 డిగ్రీల సెంటీగ్రేడ్), తక్కువ ఉష్ణోగ్రత (33 డిగ్రీల సెంటీగ్రేడ్) లలో ఉంచి వాటిపై రైనోవైరస్ చర్యలను గమనించి, ఈ అంశాన్ని స్పష్టపరిచారు.[1]

మానవునిలో రైనోవైరస్ అనే నాలుగు రకాల ఎండెమిక్ కరోనా వైరస్ ల వల్ల జలుబు వస్తుంది. అయితే మొదట్లో మనవులలో లేని ఈ వైరస్ మనలోకి ఒంటెల ద్వారా సంక్రమించిందని జర్మనీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే వీటి వల్ల మానవులకు ఎలాంటి హానీ లేదని వీరు చెబుతున్నారు. జర్మనీలోని యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ బాన్ పరిశోధకుడు క్రిస్టియన్ డ్రోస్టెన్ బృందం ఈ వైరస్‌లలో ఒకటైన హెచ్‌సీవోవీ-229ఈ వైరస్ మూలాలను కనుగొన్నారు. గబ్బిలాలు, మానవులు, తదితరాలపై చేసిన పరిశోధనల్లో ఒంటెల నుంచే సాధారణ జలుబు మానవులకు సంక్రమించినట్లు తేలిందని వీరు తేల్చారు. అయితే ఈ వైరస్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే మానవుల్లో నిరోధక శక్తి పెంపొందిందని పేర్కొన్నారు.[2]