వందేమాతరం శ్రీనివాస్


Contributors to Wikimedia projects

Article Images

వందేమాతరం శ్రీనివాస్ ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. సినిమాలకే కాక టీవీ సీరియళ్ళకు కూడా నేపథ్య సంగీతం అందించాడు. 9 నంది అవార్డులు, 9 సార్లు భరతముని పురస్కారాలు, 6 సార్లు మద్రాసు కళాసాగర్ అవార్డు, సాలూరి రాజేశ్వర రావు, ఎం. ఎస్. విశ్వనాథన్ స్మారక పురస్కారాలు అందుకున్నాడు.[1]

వందేమాతరం శ్రీనివాస్

జననం

కన్నెబోయిన శ్రీనివాస్


9 సెప్టెంబరు

రామకృష్ణాపురం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా

విద్యన్యాయ శాస్త్రం
విద్యాసంస్థవి. ఆర్. కళాశాల, నెల్లూరు
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు
పిల్లలుఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి

టి. కృష్ణ వందేమాతరం సినిమాలో వందేమాతర గీతం వరసమారుతున్నది అనే పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాటతో తన పేరులో వందేమాతరం వచ్చి చేరింది.[2] ఇతడు ప్రజా నాట్యమండలి లో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన ఆర్.నారాయణమూర్తి సినిమాలతో వెలుగులోకొచ్చాడు. అతడి సినిమాలకే అత్యధికంగా సంగీతాన్ని అందించి, పలు గీతాలు రాయడం, పాడటం చేసాడు. అమ్ములు అనే చిత్రంలో హీరో పాత్రలో నటించాడు. విప్లవ చిత్రాలతో గుర్తింపు పొందిన శ్రీనివాస్, దేవుళ్ళు చిత్రంలో భక్తి పరమైన గీతాలను సృష్టించి ఆ చిత్రాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య భూమిక పోషించారు.

ఈయన అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాస్. ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, రామకృష్ణాపురం అనే గ్రామంలో ఓ పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి పాటలంటే ఆసక్తి ఉండేది.[3] నెల్లూరు లోని వి. ఆర్. కళాశాలలో న్యాయశాస్త్రం చదివాడు.[2]

సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు

మార్చు

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్:

  • ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తెలుగు - ఒసేయ్ రాములమ్మ[4][5] (1997)
  • ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ – తెలుగు- ఆహా..! (1998)[6]
నంది అవార్డులు[7]
  • అమ్ములు (2003) చిత్రం లో కిష్టయ్యగా
  • కొంగుచాటు కృష్ణుడు (1993)