వాంతి


Contributors to Wikimedia projects

Article Images

బలవంతంగా జీర్ణకోశంలోని పదార్ధాలు నోరు, అరుదుగా ముక్కు ద్వారా బయటకు రావడాన్ని వాంతి బహువచనం వాంతులు (Vomiting) అంటారు. ఇది ఒక వ్యాధి లక్షణము. కొన్ని ప్రాంతాలవారు దీనినే కక్కు అంటారు.

వాంతి గురించిన 14వ శతాబ్దపు చిత్రలేఖనం.

వాంతులు వివిధ కారణాల వలన కలుగుతాయి. జీర్ణాశయంలోని కారణాలు, తల నొప్పి వంటి కొన్ని మెదడుకు సంబంధించిన బయటి కారణాలు. వాంతి అవుతుందేమో నన్న భయాన్ని వికారం అంటారు. ఎక్కువగా వాంతులవుతున్నప్పుడు వీటిని ఆపడానికి వైద్యం అవసరం. తీవ్రమైన పరిస్థితులలో ద్రవాలను నరం ద్వారా ఎక్కించవలసి వస్తుంది.

బ్రౌన్ నిఘంటువు ప్రకారం కక్కు అనే క్రియా పదానికి వాంతి అని అర్ధం ఉంది.[1] కక్కు [ kakku ] kakku. తెలుగు v. a. To vomit. కక్కు kakku. n. Vomiting: the thing vomited. కక్కుడు kakkuḍu. n. Vomiting.

తెలుగు మాండలికాలులో మహబూబ్ నగర్ జిల్లాలో వాంతిని కక్కు అంటారు.[2]

  • మానసిక కారణాల మూలంగా వారంతట వారే వాంతి చేసుకోవడం
  • అసహ్యమైన వాటిని చూచినా, వాసన చూసినా, ఆలోచించినా కొందరిలో వాంతవుతుంది.
  • ఎక్కువ మోతాదులో రేడియేషన్
  • ఫిట్స్ మొదలైన తీవ్రమైన క్రియలు
  • అతిగా భయం
  1. [1][permanent dead link]
  2. తెలుగు మాండలికాలు, మహబూబ్ నగర్ జిల్లా, డా. కె.లక్ష్మీనారాయణ శాస్త్రి, తెలుగు అకాడమి, హైదరాబాదు 1999, పేజీ: 90.
 

వికీమీడియా కామన్స్‌లో

కి సంబంధించిన మీడియా ఉంది.

Look up వాంతి in Wiktionary, the free dictionary.