వై.రుక్మిణి


Contributors to Wikimedia projects

Article Images

వై.రుక్మిణి

వై.రుక్మిణి తెలుగు సినిమా నటి. ఈమె తొలితరం తెలుగు సినిమా దర్శకుడు, నటుడు వై.వి.రావు భార్య. ఈమె తెలుగు, తమిళ, హిందీ భాషలలో వందకు పైగా సినిమాలలో నటించింది. 17 సంవత్సరాల వయసులో దర్శక నిర్మాత వై.వి.రావును వివాహము చేసుకొన్నది. ఈమె కూతురు లక్ష్మి కూడా తెలుగు, తమిళ సినిమాలలో నటించింది.

రుక్మిణి 4 సంవత్సరాల వయసులోనే హరిశ్చంద్ర చిత్రముద్వారా సినీరంగములో బాలనటిగా అడుగుపెట్టి 40కి పైగా సినిమాలలో బాలనటిగా పనిచేసింది. రుక్మిణి కథానాయికగా నటించిన తొలిచిత్రం ఏవియం పతాకంపై టి.ఆర్.మహాలింగం తీసిన శ్రీవల్లి. రుక్మిణి తల్లి నుంగంబాక్కం జానకి, తొలి తరం తమిళ సినిమా నటి, నర్తకి. లవంగి చిత్ర నిర్మాణ సమయంలో ఆ చిత్రానికి దర్శకుడైన వై.వి.రావును ప్రేమించి పెళ్ళి చేసుకుంది.[1]

ఈమె నటించిన తమిళ చిత్రాలలో వెన్నిరాదై, కప్పలొతీయ తమిళన్, రోజావిన్ రాజా, మనియొసై, ఇదయకమలమ్ కొన్ని ప్రముఖమైన చిత్రాలు. తెలుగు సినిమా రంగములో ఈమె ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులు ఇరువురితో కలిసి నటించింది. హిందీలో ఈమె కొన్ని చిత్రాలలో నటించడమే కానీ కొన్ని చిత్రాలను నిర్మించినది కూడా. హిందీలో రుక్మిణి నిర్మించిన సినిమాలలో లవంగి, మంజరి సినిమాలు చెప్పుకోదగినవి.

81 యేళ్ల వయసులో 2007 సెప్టెంబర్ 4న ఈమె వృద్ధాప్యము వలన చెన్నైలోని సైదాపేటలోని తన స్వగృహములో కన్నుమూసినది.

  1. "A revolutionary filmmaker- The Hindu Aug 22, 2003". Archived from the original on 2004-01-17. Retrieved 2013-07-03.