శకుని


Contributors to Wikimedia projects

Article Images

శకుని మహాభారతంలో గాంధారికి తమ్ముడు. దుర్యోధనుని మేనమామ. ఇతనికి ఇద్దరు సోదరులు వృషకుడు, అచలుడు. ఇతని కొడుకు ఉలూకుడు.

శకుని
మహాభారతం పాత్ర
దస్త్రం:Shakuni consolating Duryodhana.jpg

శకుని, దుర్యోధనులు

సమాచారం
ఆయుధంపరశు,కత్తి,గద, విల్లు
కుటుంబంసుభల, సుధర్మ (parents)
Gandhari (sister)
దాంపత్యభాగస్వామిఅర్ష
పిల్లలుఉలుక, వృకాసురుడు, వృపర్చితి
 
కేరళలోని కొల్లాం జిల్లాలోని పవిత్రేశ్వరం వద్ద శకునికి ఆలయం

శకునిని అతని అన్నలనూ కౌరవులు ఒక చెరసాలలో బంధించి, వారికి రోజూ ఒక్క మనిషికి సరిపోయే ఆహారం మాత్రం ఇస్తారు. కౌరవుల మీద ఎలా ఐనా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్న శకుని సోదరులు తమ భాగం ఆహారాన్ని కూడా శకునికి ఇచ్చి, తమ పగ తీర్చమని ప్రమాణం చేయించుకుంటారు. తదుపరి ఒక్కొక్కరుగా మరణిస్తారు.

శిక్ష అనంతరం బయటపడిన శకుని దుర్యోధనుని పొగుడుతూ, అతనికి అండగా మంత్రి స్థాయిలో ఉంటూ అతడి దురాలోచనలకు ఇతడు సహాయం చేస్తుండేవాడు. ఇతడే ధర్మరాజుని మాయా జూదంలో ఓడించింది. వనవాసము చేయుచున్న పాండవులను ఏదో విధంగా చంపమని దుర్యోధనునుకి బోధించినది కూడా ఇతడే.

దస్త్రం:Shakuni is master of Dice Game.jpg
Shakuni playing Chausar

శకుని పాచికల ఆట లేదా చౌసర్ అని పిలిచే ఆటలో నిపుణుడు. శకుని ఒక పాచిక ఆటను ఏర్పాటు చేశాడు. అందులో యుధిష్ఠిరుని రాజ్యాన్ని, అతని సోదరులు-భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు, యుధిష్ఠిర కూడా గెలిచారు. తరువాత ద్రౌపదిని కూడా గెలిపించాడు. దుర్యోధనుని ఆజ్ఞలపై దుశ్శాసనుడు ద్రౌపదిని బట్టలు విప్పడానికి ప్రయత్నించాడు కానీ కృష్ణుడు ఆమెను రక్షించాడు. ఈ ఆట యుద్ధానికి దారితీసింది

కురుక్షేత్ర సంగ్రామంలో ఇతన్ని నకుల సహదేవులు సంహరించిరి.