శాతవాహన ఎక్స్‌ప్రెస్


Contributors to Wikimedia projects

Article Images

శాతవాహన ఎక్స్‌ప్రెస్ విజయవాడ, సికింద్రాబాద్ ల మధ్య నడిచే సూపర్ఫాస్ట్ రైలుబండి. ఈ బండి 351 కిలోమీటర్లు (218 మై.) లను 5 గంటల 35 నిమిషాలలో పూరిస్తుంది. ఈ రైలు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిరల మీదుగా సికింద్రాబద్ నుండి విజయవాడకు వెళుతుంది. దక్షిణ మధ్య రైల్వే వారు నడిపే రైళ్ళలో ఇది అత్యంత వేగవంతమయినది. గంటకు దాదాపు 134 కిమీ ల వేగంతో మధిర, ఖమ్మం మధ్య నడుస్తుంది. విజయవాడ నుండి పొద్దున్నే మొదలయ్యే రైళ్ళలో ఇదొకటి.[1]

శాతవాహన ఎక్స్‌ప్రెస్

ఘట్కేసర్ వద్ద సికింద్రాబాదుకు వెళుతున్న శాతవాహన ఎక్స్‌ప్రెస్

సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్ట్
స్థానికతఆంధ్ర ప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలువిజయవాడ జంక్షన్
గమ్యంసికింద్రాబాద్ జంక్షన్
ప్రయాణ దూరం351 కి.మీ. (218 మై.)
సగటు ప్రయాణ సమయం5 గంటల 35 నిమిషాలు ఇరు మార్గాల్లో
రైలు నడిచే విధంప్రతిరోజూ
రైలు సంఖ్య(లు)12713 / 12714
సదుపాయాలు
శ్రేణులుఏసీ చెయిర్ కార్, రెండో తరగతి కుర్చీ, వంటచేయు పెట్టె, అనారక్షిత పెట్టెలు
కూర్చునేందుకు సదుపాయాలుఔను
పడుకునేందుకు సదుపాయాలుకాదు
సాంకేతికత
పట్టాల గేజ్1676
వేగం62.87 km/h (39.07 mph) average with halts
మార్గపటం
శాతవాహన ఎక్స్‌ప్రెస్ యొక్క పాంట్రీ కార్

ఈ రైలుకు శాతవాహన అని శాతవాహన సామ్రాజ్య గౌరవార్ధం నామకరణం చేశారు. శాతవాహనులు కోస్తాంధ్ర, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్, విదర్భ, కర్నాటక,, గోవాలోని కొన్ని ప్రాంతాలను పాలించారు.

శాతవాహన ఎక్స్‌ప్రెస్ విజయవాడ జంక్షన్ వద్ద ఉదయం 6:10 కు బయలుదేరుతుంది, సికింద్రాబద్కి 11:45 కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ జంక్షన్ వద్ద సాయంత్రం 4:15 కి బయలుదేరి విజయవాడకు రాత్రి 9:50 కి చేరుతుంది. సగటున 25 నిమిషాల ఆల్స్యంగా సికింద్రాబాద్ కు, 20 నిమిషాల ఆలస్యంతో విజయవాడకు చేరుతుంది.

ఈ రైలు ఖాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, మధిర అనే ప్రదేశాలలో ఆగుతూ చివరికి విజయవాడ చేరుతుంది. ఈ రైలు (రైలు సం.12713) దక్షిణ మధ్య రైల్వే జోన్ లో అతి వేగంగా ప్రయాణించే రైళ్ళలో ఒకటి. ఈ రైలు మధిక, ఖమ్మం ల మధ్య 134 కి.మీ/గంట వడితో ప్రయాణిస్తుంది. విజయవాడకు నుండి బయలుదేరే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ లలో ఇది ఒకటి. విజయవాడ నుండి ఉదయం బయలుదేరే యితర రైళ్ళు పినాకిని ఎక్స్‌ప్రెస్, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్.

ఈ రైలులో మొత్తం 24 బోగీలు ఉంటాయి. ఈ రైలును లాలాగూడా షెడ్ కు చెందిన WAP-7 ఇంజన్ లాగుతుంది.

12713
విజయవాడ నుండి సికింద్రాబాదుకు వెళ్ళే రైలు [2]
  • 2013 నవంబరు 7 : విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న శాతవాహన ఎక్స్ ప్రెస్ లో గురువారం ఉదయం సాంకేతికలోపం ఏర్పడింది. దాంతో ఖమ్మం జిల్లాలోని మొటుపర్రు వద్ద ఆ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. దీంతో విజయవాడ - వరంగల్ మధ్య పలు రైళ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శాతవాహన ఎక్స్ ప్రెస్ లోని ప్రయాణికులే కాకుండా పలు రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.[3]
  • 2015 ఆగస్టు 26 : మెయిన్‌లైన్‌లో గూడ్సురైలు ఉండడంతో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను లూప్‌లైన్‌లో వదిలారు. అయితే లూప్‌లైన్ పట్టాలు బలహీనంగా ఉండడంతో రైలు మామూలు పట్టాలపై వెళ్లినట్లు వేగంగా వెళ్లడంతో బోగీలన్నీ ఒక్కసారిగా ఊగిపోయాయి. దాంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై కేకలు వేస్తూ చైన్ లాగి రైలును ఆపేశారు. ఈ సంఘటన మహబూబాబాద్- డోర్నకల్ మార్గంలో గుండ్రాజుమడుగు రైల్వేస్టేషన్ వద్ద 2015 ఆగస్టు 26 రాత్రి జరిగింది.[4]
  1. "Satavahana passengers spend tense moments". The Hindu (in Indian English). 2012-02-02. ISSN 0971-751X. Retrieved 2016-05-15.
  2. 12713/Satavahana SF Express
  3. సాంకేతిక లోపంతో నిలిచిన 'శాతవాహన ఎక్స్ ప్రెస్ ' Sakshi | Updated: November 07, 2013
  4. శాతవాహన ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం Sakshi | August 26, 2015