షీనా భాష


Contributors to Wikimedia projects

Article Images

షీనా భాష

షీనా భాష అనేది షీనా ప్రజలు మాట్లాడే ఇండో - ఆర్యన్ భాష.

షీనా భాష అనేది షీనా ప్రజలు మాట్లాడే ఇండో - ఆర్యన్ భాష. పాకిస్తాన్‌లో, ప్రధానంగా పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న గిల్గిత్-బాల్టిస్తాన్, భారతదేశంలోని లడఖ్, కాశ్మీర్ లలో నివసిస్తున్న 1,146,000 మంది ప్రజలు మాట్లాడే ప్రధాన భాష.[4][5] ఇది ఇండో- ఆర్యన్ భాషా కుటుంబంలోని ఇండో-ఇరానియన్ భాషా ఉపకుటుంబానికి చెందిన ఇండో-ఆర్యన్ శాఖకు చెందినది. ఈ భాష టార్డిక్ భాషలలో ఒకటిగా వర్గీకరించబడింది .

షీనా
ݜݨیاٗ
Ṣiṇyaá

ఈ పదం అరబిక్ లిపిలో నాస్తాలిక్ శైలిలో వ్రాయబడింది.

ఉచ్ఛారణసింజా
స్థానిక భాషపాకిస్తాన్, భారతదేశం
ప్రాంతంగిల్గిత్-బాల్టిస్తాన్, కోహిస్తాన్ డిస్ట్రిక్ట్, ద్రాస్, లడఖ్, గురేజ్
స్వజాతీయతషీనా ప్రజలు

స్థానికంగా మాట్లాడేవారు

7,20,200 షీనా (2018)[1]
షీనా, కోహిస్తాని 458,000 (2018)[2]

ఇండో-యూరోపియన్

  • ఇండో-ఇరానియన్
    • ఇండో-ఆర్యన్
      • డార్డిక్ భాషలు
        • షీనా
అరబిక్ లిపి [3]
భాషా సంకేతాలు
ISO 639-3Either:
scl – ప్రామాణిక షీనా
plk – కోహిస్తానీ షీనా
Glottolog1264 షిన్ 1264  షీనా
కోహి1248  కోహిస్తానీ షీనా

ముదురు నారింజ రంగులో షీనా భాష పంపిణీ

ఈ భాష మాట్లాడే ప్రాంతాలలో పాకిస్తాన్-నియంత్రిత ప్రావిన్సులలో అస్టోర్, చిలాస్, డారెల్, టాంగీర్, గిల్గిట్, ఘిజర్, బాల్టిస్తాన్, కోహిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. దీనిని భారతదేశ నియంత్రణలో ఉన్న గురేజ్, ద్రాస్, కార్గిల్‌లో మాట్లాడతారు. 1981లో ఈ భాషని మొత్తం దాదాపు 3,21,000 మంది మాట్లాడినట్లు అంచనా.

షీనా భాషలో వారంపేర్లు సంస్కృతానికి దగ్గరగా ఉంటాయి.

షీనా (దేవనాగరి) సంస్కృతం
ఆదిత్ ఆదిత్య వార్
సుందురో సోమ్ వార్
ఉంగారో మంగళ్ వార్
బోదో బుధ్ వార్
బ్రెస్పుత్ బృహస్పతి వార్
శుకర్ శుక్ర్ వార్
షింషేర్ శనిచర్ వార్
షీనా తెలుగు అర్థం
గిలిత్ గిల్గిత్
కోన్? ఎక్కడ?
ఆన్ ఇక్కడ
అదాన్ అక్కడ
ఆల్ అక్కడ
ఖిరీ బేయ్ కూర్చో
వెయ్ పి నీరు త్రాగాలి
తికీ కా భోజనం చేయండి
బాబా తండ్రి
ఆజి అమ్మ
జ్రహ్ సోదరుడు
మిష్తి దిశా కోన్ హిన్? మంచి ప్రదేశం ఎక్కడ ఉంది?
తు కోన్తే బుజానే? మీరు ఎక్కడికి వెళుతున్నారు?
షాల్బాల్ పిల్లలు
బడో పెద్ద
చునో చిన్న
జ్రిగో పొడవు
అశతో బలహీన
డాంగో అధికంగా
  1. "Shina". Ethnologue. Archived from the original on 2019-06-06. Retrieved 25 June 2019.
  2. "Shina, Kohistani". Ethnologue. Archived from the original on 2019-06-05. Retrieved 25 June 2019.
  3. "Ethnologue report for Shina". Ethnologue.
  4. Saxena, Anju; Borin, Lars (2008-08-22). Lesser-Known Languages of South Asia: Status and Policies, Case Studies and Applications of Information Technology. Walter de Gruyter. ISBN 978-3-11-019778-5.
  5. "Shina | Ethnologue". www.ethnologue.com. 2019-06-06. Archived from the original on 2019-06-06. Retrieved 2023-06-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)