సెక్రటరీ


Contributors to Wikimedia projects

Article Images

సెక్రెటరీ చిత్రం 1976 లో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, నిర్మాత డీ.రామానాయుడు నిర్మించిన తెలుగు ఫ్యామిలీ డ్రామా చిత్రం.ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ,చంద్రమోహన్, గుమ్మడి, కాంచన, తదితరులు నటించారు. సంగీతం కె వి మహదేవన్ సమకూర్చగ , యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

సెక్రటరీ
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
నిర్మాణం డి.రామానాయుడు
కథ యద్దనపూడి సులోచనా రాణి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ,
జయసుధ,
చంద్రమోహన్,
కాంచన,
సత్యనారాయణ,
కృష్ణకుమారి,
రంగనాథ్
శాంతకుమారి,
గిరిజ
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం వి.రామకృష్ణ, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
గీతరచన ఆత్రేయ
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తెలుగు సినిమా చరిత్రలో నవలలను ఆధారంగా చిత్రాలను నిర్మించి విజయం సాధించిన సంస్ధలు సురేష్,అన్నపూర్ణ సంస్ధలు. ఆ కోవలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన సెక్రటరీ సినిమా. యుధ్దనపూడి సులోచనారాణి రచించిన సెక్రటరీ నవల ఈ సినిమా కి ఆధారం.

పాటల రచయిత ఆచార్య ఆత్రేయ.

  • మనసులేని బ్రతుకొక నరకం, గానం. వి. రామకృష్ణ
  • నా పక్కన చోటున్నది ఒక్కరికే , గానం. వి. రామకృష్ణ
  • ఆకాశమంత పందిరి వేసి, గానం.వి.రామకృష్ణ, సుశీల
  • చాటుమాటు సరసంలో, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • మొరటోడు నా మొగుడు , గానం.వి.రామకృష్ణ, పి.సుశీల
  • పెదవి విప్పలేను , గానం.వి.రామకృష్ణ , పి.సుశీల
  • నేటిదా ఒకనాటిదా , గానం.వి.రామకృష్ణ , పులపాక సుశీల .