అజిత్ పవార్


Contributors to Wikimedia projects

Article Images

అజిత్‌ పవార్‌ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక, ప్రణాళిక శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]

అజిత్ పవర్

8వ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
పదవీ కాలం
23 నవంబర్ 2019 – 26 నవంబర్ 2019
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు రాష్ట్రపతి పాలన
పదవీ కాలం
25 అక్టోబర్ 2012 – 26 సెప్టెంబర్ 2014
గవర్నరు *కే . సంకరనారాయణన్
తరువాత రాష్ట్రపతి పాలన
పదవీ కాలం
10 నవంబర్ 2010 – 25 సెప్టెంబర్ 2012
గవర్నరు *ఎస్. సి. జమీర్
  • కే . సంకరనారాయణన్
ముందు ఛగన్ భుజబల్

వ్యక్తిగత వివరాలు


జననం 1959 జూలై 22 (వయసు 65)
డియోలాలీ ప్రవరా, మహారాష్ట్ర
నివాసం బారామతి,సహయోగ్ , మహారాష్ట్ర , భారతదేశం

అజిత్ పవార్ 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా పని చేసి 2023 జూన్ 2న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో తిరుగుబాటు చేసి అదే రోజు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2][3]

రాజకీయ జీవితం

మార్చు

అజిత్ పవార్ తన శరద్ పవార్ పెద్ద నాన్న అడుగుజాడల్లో 1982లో చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రవేశం చేసి 1991లో పుణె జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఆయన 1991లో బారామతి లోక్‌సభ స్థానం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. అజిత్ పవార్ అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుండి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ స్థానం నుండి వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించాడు.[4]

అజిత్ పవార్ అనంతరం సుధాకర్‌రావు నాయక్‌ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా తొలిసారి భాద్యతలు చేపట్టి ఆ తరువాత శరద్‌ పవార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహాయ మంత్రిగా పలు విభాగాల బాధ్యతలు, 1999లో శరద్‌ పవార్‌ కాంగ్రెస్‌ను వీడి ఎన్‌సిపి స్థాపించినప్పుడు ఆయన వెంటే  పార్టీలో చేరి అదే ఏడాది మహారాష్ట్రలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్‌-ఎన్‌సిపి పొత్తు పెట్టుకోగా విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన ఆ తరువాత అశోక్‌ చవాన్‌, సుశీల్‌ కుమార్‌ షిండే, పృథ్వీరాజ్ చవాన్ మంత్రివర్గంలో మంత్రిగా & ఉపముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.

ఇతర పార్టీలు

మార్చు

మూలాలు

మార్చు