అజ్మీర్ జిల్లా


Contributors to Wikimedia projects

Article Images

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో అజ్మీర్ జిల్లా ఒకటి. జిల్లా పరిపాలనా కేంద్రం అజ్మీర్ పట్టణం. అజ్మీర్ జిల్లా రాజస్థాన్ మధ్యభాగంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో నాగౌర్ జిల్లా, తూర్పు సరిహద్దులో జైపూర్ జిల్లా, టోంక్ జిల్లా దక్షిణ సరిహద్దులో భిల్వారా జిల్లా, పశ్చిమ సరిహద్దులో పాలి జిల్లాలు ఉన్నాయి.

అజ్మీర్ జిల్లా

अजमेर जिला

ఎడమ నుండి సవ్యదిశలో: అజ్మీర్ షరీఫ్ దర్గా, అనా సాగర్ సరస్సు దగ్గర బరాదారిస్, తారాగఢ్ సమీపంలోని కొండలు, పుష్కర్ సరస్సు సమీపంలో ఘాట్‌లు, అక్బరీ కోట

రాజస్థాన్ రాష్ట్ర పటంలో అజ్మీర్ జిల్లా

రాజస్థాన్ రాష్ట్ర పటంలో అజ్మీర్ జిల్లా

Coordinates (అజ్మీర్): 26°27′N 74°38′E / 26.450°N 74.633°E
దేశంభారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లాఅజ్మీర్
ప్రధాన కార్యాలయంఅజ్మీర్
ఉప విభాగాలు
Government
 • జిల్లా కలెక్టరుఆర్తి డోగ్రా [1]
 • లోక్‌సభ నియోజక వర్గాలు
విస్తీర్ణం
 • మొత్తం8,481 కి.మీ2 (3,275 చ. మై)
జనాభా

 (2011)

 • మొత్తం25,83,052
 • జనసాంద్రత300/కి.మీ2 (790/చ. మై.)
 • Urban40.1%
జనాభా
 • అక్షరాస్యత69.3%
 • లింగ నిష్పత్తి951
Time zoneUTC+05:30
Vehicle registrationRJ-01
జాతీయ రహదారులుఎన్ఎచ్ 48, 58, 448
సగటు వార్షిక అవపాతం481.3[2] mm

జిల్లా వైశాల్యం 8,481 చ.కి.మీ. జిల్లా తూర్పు భూభాగం చదునుగా ఉంటుంది. పశ్చిమ భాగంలో ఆరవల్లి పర్వతావళి ఉంది. జిల్లా అనేక లోయలు భారతదేశంలోని థార్ ఎడారిలో భాగంగా ఉన్న ఇసుక ఎడారులుగా ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం కొన్ని వర్షాధార భూములు మరికొన్ని వ్యవసాయ భూములు ఉన్నాయి. నాగ్ పత్తర్ సర్పెంట్ రాళ్ళ గోడల మద్య ఒక కృత్రిమ సరోవరం ఉంది. అజ్మీర్ జిల్లాలో నదులు లేవు. జిల్లా సరిహద్దులో బనాస్ నది ప్రవహిస్తుంది.జిల్లాలో 4 సెలయేర్లు ఉన్నాయి. సాగర్మతి, సరస్వతి, ఖరిడై ఇంకా ఇతరాలు.

  • జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి: అజ్మీర్, బీవార్, కెక్రి, కిషన్‌గర్.
  • జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి:- అజ్మీర్, బీవార్, నసీరాబాద్, మసుద, కెక్రి, కిషన్‌నగర్

2011 జనాభా లెక్కల ప్రకారం రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో మొత్తం జనాభా 2,583,052. వీరిలో 1,324,085 మంది పురుషులు కాగా, 1,258,967 మంది మహిళలు ఉన్నారు. 2011 లో అజ్మీర్ జిల్లాలో మొత్తం 494,832 కుటుంబాలు నివసిస్తున్నాయి. అజ్మీర్ జిల్లా సగటు లింగ నిష్పత్తి 951గా ఉంది.

2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో 40.1% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా 59.9% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 83.9% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 59.1%గా ఉంది అజ్మీర్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 936 కాగా, గ్రామీణ ప్రాంతాలు 961 గా ఉన్నాయి.

అజ్మీర్ జిల్లాలోని మొత్తం జనాభాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 381167, ఇది మొత్తం జనాభాలో 15%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 200511 మగ పిల్లలు, 180656 ఆడ పిల్లలు ఉన్నారు.పిల్ల లింగ నిష్పత్తి 901, ఇది అజ్మీర్ జిల్లా సగటు లింగ నిష్పత్తి (951) కన్నా తక్కువ.

అజ్మీర్ జిల్లా మొత్తం అక్షరాస్యత 69.33%. అజ్మీర్ జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 69.96%, స్త్రీ అక్షరాస్యత రేటు 47.69%.[3][4]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనసంఖ్య 2,180,526. జిల్లాలో హిందువులు 1,869,044, ముస్లింలు 244,341, జైనులు 47,812 మంది ఉన్నారు.