అమ్రోహా


Contributors to Wikimedia projects

Article Images

అమ్రోహా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

అమ్రోహా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణం. ఇది అమ్రోహా జిల్లాకు ముఖ్య పట్టణం. ఇది మొరాదాబాద్‌కు వాయవ్యంగా, సోట్ నదికి సమీపంలో ఉంది. ఇది ఢిల్లీ నుండి 130 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి శీతోష్ణస్థితి చాలావరకు ఢిల్లీని పోలి ఉంటుంది. నగరాన్ని ప్రదేశాలుగా, బ్లాక్‌లుగా విభజించారు. అమ్రోహా శీతోష్ణస్థితి హిమాలయాల పాదాల వద్ద ఉన్న పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని ఇతర ప్రాంతాల మాదిరిగానే, వేసవిలో వేడిగాను, శీతాకాలంలో పొడిగా చల్లగానూ ఉంటుంది.

అమ్రోహా

పట్టణం

అమ్రోహా is located in Uttar Pradesh

అమ్రోహా

అమ్రోహా

ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం

Coordinates: 28°54′15.95″N 78°28′3.10″E / 28.9044306°N 78.4675278°E
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాఅమ్రోహా
జనాభా

 (2011)[1]

 • Total1,98,471
భాషలు
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN

244221[3]

టెలిఫోన్ కోడ్05922
Vehicle registrationUP-23

2011 జనాభా లెక్కల ప్రకారం, అమ్రోహా జనాభా 1,98,471. ఆరేళ్ళ లోపు పిల్లల జనాభా 28,323. ఇది, అమ్రోహా (ఎన్‌పిపి) మొత్తం జనాభాలో 14.27%. స్త్రీ పురుష లింగనిష్పత్తి 925. రాష్ట్ర సగటు 912 తో పోలిస్తే ఇది మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా, పిల్లల్లో లింగనిష్పత్తి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర సగటు 902 తో పోలిస్తే అమ్రోహా 950 తో మెరుగ్గా ఉంది. అమ్రోహాలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 1,98,471, ఇది జనాభాలో 53.5%, పురుషుల్లో అక్షరాస్యత 57.2%, స్త్రీలలో అక్షరాస్యత 49.3%. అమ్రోహాలో ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత 62.4% కాగా, ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 66.7% స్త్రీల అక్షరాస్యత రేటు 57.6%. షెడ్యూల్డ్ కులాల జనాభా 12,039, షెడ్యూల్డ్ తెగల జనాభా 14. 2011 లో అమ్రోహాలో 33,903 గృహాలున్నాయి. [1]

మామిడి పండ్ల ఉత్పత్తికి అమ్రోహా ప్రసిద్ధి. [4] ఈ ప్రాంతంలో పత్తి పండడం చేత అమ్రోహాలో వస్త్ర పరిశ్రమ కూడా వర్ధిల్లింది. చిన్న తరహా నేత పరిశ్రమలు, చేతి మగ్గాలు, కుండల తయారీ, చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. కార్పెట్ తయారీ, చెక్క హస్తకళలు, ధోలక్ తయారీకి కూడా అమ్రోహా ప్రసిద్ధి.

అమ్రోహా, న్యూ ఢిల్లీ-లక్నో నాలుగు వరుసల జాతీయ రహదారి 24 నుండి 5 కి.మీ. దూరంలో ఉంది. అమ్రోహా నుండి ఢిల్లీకి చక్కటి రైలు, రోడ్డు సౌకర్యాలున్నాయి. అమ్రోహా రైల్వే స్టేషను, ఔధ్, రోహిల్‌ఖండ్ రైల్వే నిర్మించిన ఢిల్లో-మొరాదాబాద్ మార్గంలో కోల్‌కతాకు 868 మైళ్ల దూరంలో ఉంది. అన్ని ప్యాసింజర్ రైళ్లు, చాలా ఎక్స్‌ప్రెస్ రైళ్లూ ఇక్కడ ఆగుతాయి.

  1. 1.0 1.1 "Census of India- Amroha". www.censusindia.gov.in. Retrieved 18 December 2019.
  2. "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 23 నవంబరు 2020.
  3. "Amroha Pin code". citypincode.in. Archived from the original on 22 మార్చి 2014. Retrieved 21 March 2014.
  4. "BBCHindi". www.bbc.com. Retrieved 18 December 2019.