అహ్వా (గుజరాత్)


Contributors to Wikimedia projects

Article Images

అహ్వా (పట్టణం) భారతదేశం, గుజరాత్ రాష్ట్రం, డాంగ్ జిల్లా లోని పట్టణం. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం.[1] ఇది సముద్ర మట్టానికి దాదాపు 1800 అడుగుల (549 మీ) ఎత్తులో ఉంది. ఇది గిరిజనులు నివసించే జిల్లా. ఈ జిల్లా మొత్తం దట్టమైన అడవితో నిండిన కొండ ప్రాంతం. ఇక్కడి తిరిగే విషపూరితమైన పాములను ఇంజెక్షన్ల తయారీ కోసం బొంబాయిలోని హాఫ్‌కిన్ ఇన్‌స్టిట్యూట్‌కి పంపుతారు.[2] 1857కు ముందు జేమ్స్ ఔట్‌రామ్ ద్వారా అహ్వా పట్టణం, డాంగ్ జిల్లాకు ప్రధాన కార్యాలయంగాఎంపిక చేయబడింది.[2]

అహ్వా

పట్టణం

అహ్వా is located in Gujarat

అహ్వా

అహ్వా

గుజరాత్ పటంలో స్థానం

అహ్వా is located in India

అహ్వా

అహ్వా

అహ్వా (India)

Coordinates: 20°45′0″N 73°41′0″E / 20.75000°N 73.68333°E
దేశం భారతదేశం
రాష్ట్రంగుజరాత్
జిల్లాడాంగ్
జనాభా

 (2011)

 • Total22,829
భాషలు
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్

394710

Vehicle registrationజిజె-30

గొండాల్విహిర్, చంఖాల్, బోర్ఖాల్, భవందగడ్, వసుర్నా అహ్వాలోని కొన్ని ప్రాంతాలు. అహ్వా చుట్టూ ఉత్తరం వైపు డాంగ్ తాలూకా, దక్షిణం వైపు సుర్గాన తాలూకా, పశ్చిమాన వంశదా తాలూకా, దక్షిణం వైపు కల్వాన్ తాలూకా ఉన్నాయి. సోంగాధ్, వ్యారా, సతానా, ధరంపూర్, భారతదేశం అహ్వాకు సమీపంలోని నగరాలు. గుజరాతీ ఇక్కడ స్థానిక భాష.

అహ్వా అనేది డాంగ్ జిల్లాలోని ది డాంగ్ తాలూకాలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం, అహ్వా నగరంలో మొత్తం 3,071 కుటుంబాలు నివసిస్తున్నాయి.[3] అహ్వా పట్టణ మొత్తం జనాభా 15,004 అందులో 7,677 మంది పురుషులు కాగా, 7,327 మంది స్త్రీలు ఉన్నారు.[4] కాబట్టి అహ్వా సగటు లింగ ప్రతి 1000 మంది పురుషులకు 954 మంది స్త్రీలు ఉన్నారు. అహ్వా నగరంలోని మొత్తం జనాభాలో 0-6 సంవత్సరాల వయస్సు లోపు గల పిల్లల జనాభా 1722. ఇది మొత్తం జనాభాలో 11% ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 909 మంది మగ పిల్లలు ఉండగా, 813 మంది ఆడ పిల్లలు ఉన్నారు. అందువల్ల 2011 జనాభా లెక్కల ప్రకారం అహ్వా పిల్లల లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది మగ పిల్లలకు, 894 మంది బాలికలు ఉన్నారు, ఇది పట్టణ మొత్తం సగటు లింగ నిష్పత్తి (954) కంటే తక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం, అహ్వా అక్షరాస్యత రేటు 90.4%. దీనిని డాంగ్ జిల్లా అక్షరాస్యత రేటు 75.2%తో పోలిస్తే, అహ్వా అధిక అక్షరాస్యతను కలిగి ఉంది. అహ్వాలో పురుషుల అక్షరాస్యత రేటు 94.25% ఉఁడగా, స్త్రీల అక్షరాస్యత రేటు 86.38% ఉంది.[4]

మతం ప్రకారం పట్టణ జనాభా

మార్చు

హిందువులు 82.78% , ముస్లింలు 8.02% , క్రిస్టియన్ 8.67% , సిక్కులు 0.05% , బౌద్ధులు 0.08% , జైనులు 0.12% , ఇతరులు 0.20% మంది ఉండగా, మతం పాటించనివారు 0.09% మంది ఉన్నారు.[5]

  1. "Significant bird records and local extinctions in Purna and Ratanmahal Wildlife Sanctuaries, Gujarat, India-PRANAV TRIVEDI and V. C. SONI" (PDF). Archived from the original (PDF) on 10 August 2017. Retrieved 23 April 2017.
  2. 2.0 2.1 G. D. Patel, ed. (1971). Gazetteer of India: Dangs District. Ahmedabad: Directorate of Government Print., Stationery and Publications. pp. 497–498.
  3. "Ahwa Town Population - The Dangs, Gujarat". Censusindia2011.com. Retrieved 2023-06-23.
  4. 4.0 4.1 "Ahwa Population, Caste Data The Dangs Gujarat - Census India". www.censusindia.co.in. Retrieved 2023-06-23.
  5. "Ahwa Census Town City Population Census 2011-2023 | Gujarat". www.census2011.co.in. Retrieved 2023-06-23.