ఉదల్గురి


Contributors to Wikimedia projects

Article Images

ఉదల్గురి

అస్సాం రాష్ట్రంలోని ఉదల్గురి జిల్లా ముఖ్య పట్టణం.

ఉదల్గురి, అస్సాం రాష్ట్రంలోని ఉదల్గురి జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.

ఉదల్గురి

పట్టణం

ఉదల్గురి is located in Assam

ఉదల్గురి

ఉదల్గురి

భారతదేశంలోని అసోంలో ప్రదేశం ఉనికి

ఉదల్గురి is located in India

ఉదల్గురి

ఉదల్గురి

ఉదల్గురి (India)

Coordinates: 26°44′43″N 92°05′46″E / 26.7452°N 92.0962°E
దేశం భారతదేశం
రాష్ట్రంఅస్సాం
జిల్లాఉదల్గురి
Government
 • Bodyఉదల్గురి పురపాలక సంస్థ
విస్తీర్ణం
 • Total4.69 కి.మీ2 (1.81 చ. మై)
Elevation180 మీ (590 అ.)
జనాభా

 (2011)

 • Total15,279
భాషలు
 • అధికారికబోడో భాష
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్

784509

టెలిఫోన్ కోడ్03711 XXXXXX
Vehicle registrationఏఎస్-27

ఉదల్గురి అనే పేరు 'ఓడాల్ చెట్టు' నుండి వచ్చిందని కొందరు, ఉద్దలక్ ముని అనే రుషి ఇక్కడ ఉన్నందున ఈ ప్రాంతానికి ఉదలగురి అనే పేరు వచ్చిందని మరికొందరి చరిత్రకారుల అభిప్రాయం. 'ఓర్డ్లా+ గుంద్రీ' (ఓర్డలగుంద్రి > ఓర్డలగుండి > ఒడాల్గురి > ఉదలగురి) అనే రెండు బోడో భాష పదాల నుండి వచ్చిందని మరికొందరి నమ్మకం. బోడో ప్రజలు ఇప్పటికీ దీనిని ఓదల్‌గురి అని పిలుస్తారు. బోడో భాషలో 'ఓర్డ్లా' అంటే విశాలమైనదని, 'గుంద్రీ' అంటే పొడి వస్తువని అర్థం.[1]

ఉదల్గురి పట్టణం 26°44′43″N 92°05′46″E / 26.7452°N 92.0962°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[2] ఇది సముద్ర మట్టానికి 180 మీటర్ల (590 అడుగుల) ఎత్తులో ఉంది. పట్టణ విస్తీర్ణం 4.69 చ.కి.మీ. (1.81 చ.మై.) ఉంది.

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఉదల్గురి పట్టణంలో 15,279 జనాభా ఉంది. ఈ జనాభాలో పురుషులు 52% మంది, స్త్రీలు 48% మంది ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 74% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 80% కాగా, స్త్రీ అక్షరాస్యత 67%గా ఉంది. పట్టణ జనాభాలో 12% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[1]

ఉదల్గురి పట్టణం, మంగల్‌దాయి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోఉంది.[3]

  1. 1.0 1.1 "District Profile | Udalguri District | Government Of Assam, India". udalguri.assam.gov.in. Archived from the original on 2021-04-23. Retrieved 2020-12-24.
  2. Falling Rain Genomics, Inc – Odalguri
  3. "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2020-12-24.