కంసుడు


Contributors to Wikimedia projects

Article Images

కంసుడు

మహాభారతంలోని పాత్ర

కంసుడు భాగవత పురాణంలోని ఒక పాత్ర.

కంసుడు

కంసుడిని సంహరిస్తున్న కృష్ణుడు

Information
కుటుంబంఉగ్రసేనుడు (తండ్రి(, పద్మావతి (తల్లి)
దాంపత్యభాగస్వామిఅస్తి, ప్రాప్టి (జరాసంధుని కుమార్తెలు)
బంధువులు

ఉగ్రసేనుడు అనె యాదవ రాజుకు కొడుకు. మధురాపురమునకు రాజు. శ్రీకృష్ణుని మేనమామ. ఇతడు పూర్వజన్మమునందు కాలనేమి అను రాక్షసుడు. కనుక ఈ జన్మమందును ఆవాసన తప్పక దేవతలకు విరోధియై అనేకులను రాక్షసులను తోడుచేసికొని సాధువులను బాధించుచుండును. ఇట్లు ఉండి ఒకనాడు తన చెల్లెలు అగు దేవకీదేవిని వసుదేవునకు ఇచ్చి వివాహముచేసి ఆవధూవరులను రథముమీఁద కూర్చుండఁబెట్టుకొని తాను సారథియై మిక్కిలి ఉత్సాహముతో రథమును తోలుకొని పోవుచు, "నీచెల్లెలి యొక్క యెనిమిదవ కొడుకు నిన్ను చంపును" అను మాట ఒకటి చెవిని పడఁగానే మనసు చలింపఁగా, తటాలున రథమునుండి దిగి చెల్లెలు ఐన దేవకీ దేవిని కొప్పుపట్టి ఈడ్చి నేలఁబడవేసి తల నరికి చంపఁబోయెను. అప్పుడు వసుదేవుఁడు బహువిధముల వేఁడుకోఁగా, చంపక విడిచి పెట్టి అది నిమిత్తముగా దేవకీవసుదేవులకు సంకెళ్లువేసి కారాగృహమునందు ఉంచి దేవకి కన్నకొడుకులను ఎల్లను చంపుచువచ్చి, కడపట యోగమాయవల్ల కృష్ణుఁడు వ్రేపల్లెలో నందునియింట చేరి ఉన్న సమాచారముతెలిసి, అతని చంపుటకు బహుప్రయత్నములుచేసి కడపట అతనిచేతనే చంపబడెను.

  • పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879