కేలండరు


Contributors to Wikimedia projects

Article Images

కేలండరు

(కేలండర్ నుండి దారిమార్పు చెందింది)

కాలెండరు, లేదా క్యాలెండరు (ఆంగ్లం: క్యాలెండర్) అనగా, సంవత్సరంలో అన్ని రోజులు, వారాలు, నెలలు కాలాన్ని చూపించే ముద్రిత పట్టికను క్యాలెండరు అని అంటారు.[1]అయితే ప్రస్తుత సాంకేతిక యుగాలలో పుస్తక రూపం కాకుండా వివిధరూపాలలో తయారవుతుంది.దీనిని సామాజిక, ధార్మిక, వర్తక లేదా పరిపాలనా సౌలభ్యంకొరకు తయారు చేయబడింది.దీనిలో కాలం, దినములు, వారములు, నెలలు,, సంవత్సరములు తగు రీతిలో అమర్చబడి వుంటాయి. దీనిలో ప్రతి దినమునకు 'ఒక కేలండర్ దినం' అని సంబోధిస్తారు. అన్ని సంస్కృతులలోనూ, నాగరికతలలోనూ, వారి వారి విధానాలను బట్టి, వారి అవసరాలను బట్టి వారి కేలండర్లు వుంటాయి.ఈ కేలండర్లు, పేపర్లపై గాని, కంప్యూటర్ విధానాలలో గాని తయారుచేస్తారు.కేలండర్, పరిపాలనా యంత్రాంగం వారు, ప్రత్యేక కార్యక్రమాల అనుసారం సాంవత్సరిక కార్యక్రమాల పట్టికను తయారు చేస్తారు, ఉదాహరణకు అకాడమిక్ కేలండర్, కోర్టు కేలండర్.).

1871-1872 హిందూ కాలమానముకు చెందిన ఒక పుట.
  1. "CALENDAR | meaning in the Cambridge English Dictionary". dictionary.cambridge.org (in ఇంగ్లీష్). Retrieved 2020-08-05.
  2. NASA - Year Dating Conventions
  • మహీధర నళినీమోహన్‌, కాలంధర కథ, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, విజ్ఞాన్‌ భవన్‌, బ్యాంక్‌ వీధి, హైదరాబాదు, 1981.