ఖలీలాబాద్


Contributors to Wikimedia projects

Article Images

ఖలీలాబాద్

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

ఖలీలాబాద్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. ఇది సంత్ కబీర్ నగర్ జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలన మునిసిపల్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతుంది. పట్టణాన్ని 25 వార్డులుగా విభజించారు.

ఖలీలాబాద్

ఖలీలాబాద్ is located in Uttar Pradesh

ఖలీలాబాద్

ఖలీలాబాద్

ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం

Coordinates: 26°47′N 83°04′E / 26.78°N 83.07°E
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాసంత్ కబీర్ నగర్
విస్తీర్ణం
 • Total26 కి.మీ2 (10 చ. మై)
Elevation69 మీ (226 అ.)
జనాభా

 (2011)

 • Total47,847
 • జనసాంద్రత1,042/కి.మీ2 (2,700/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN

272175

Websitehttp://sknagar.nic.in/

ఖలీలాబాద్, చేనేత వస్త్ర మార్కెట్‌కు ప్రసిద్ధి చెందింది. దీనిని బర్దాహియా బజార్ అని పిలుస్తారు.

ఖలీలాబాద్ ఫైజాబాద్-గోరఖ్పూర్ రహదారిపై గోరఖ్‌పూర్‌కు పశ్చిమాన 36 కి.మీ, బస్తీకి తూర్పున 36 కి.మీ. దూరంలో ఉంది. ఖలీలాబాద్ 26 47' ఉత్తర అక్షాంశం, 83 4 ' తూర్పు రేఖాంశాల వద్ద ఉంది

దక్షిణం వైపున ఉన్న జిల్లాల కంటే జిల్లా వాతావరణం చాలా సమానం. సంవత్సరాన్ని నాలుగు సీజన్లుగా విభజించవచ్చు. శీతాకాలం, నవంబరు మధ్య నుండి ఫిబ్రవరి వరకు, వేసవి కాలం జూన్ మధ్య వరకు ఉంటుంది. జూన్ మధ్య నుండి సెప్టెంబరు చివరి వరకు నైరుతి రుతుపవనాల కాలం. అక్టోబరు నుండి నవంబరు మధ్య వరకు వర్షాకాలం లేదా పరివర్తన కాలం.

జాతీయ రహదారి 27, జాఅతీయ రహదారి 28 ఎలు ఖలీలాబాద్‌ గుండా వెళుతున్నాయి.

ఖలీలాబాద్ రైల్వే స్టేషను గోరఖ్పూర్ - లక్నో మార్గంలో ఉంది.

సమీప విమానాశ్రయం గోరఖ్‌పూర్‌లో ఉంది.

భారత జనగణన 2011 ప్రకారం.ఖలీలాబాద్ పట్టణ జనాభా 47,847. అందులో 25,154 మంది పురుషులు, 22,693 మంది మహిళలు.