టాటో (అరుణాచల్ ప్రదేశ్) - వికీపీడియా


Article Images

టాటో (అరుణాచల్ ప్రదేశ్)

(టాటో (అరుణాచల ప్రదేశ్) నుండి దారిమార్పు చెందింది)

టాటో , భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని షి యోమి జిల్లాకు చెందిన ఒక పట్టణం.ఇది షి యోమి జిల్లా ప్రధాన కార్యాలయం.

ఈ పట్టణం మొత్తం 50 కుటుంబాలు నివసిస్తున్న మధ్యస్థ పరిమాణ గ్రామం. 2011 జనాభా లెక్కల ప్రకారం టాటో గ్రామ జనాభా 286 మంది, ఇందులో పురుషులు 133 మంది కాగా, స్త్రీలు 153 మంది ఉన్నారు.టాటో గ్రామ మొత్తం జనాభాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 52 మంది ఉన్నారు, ఇది గ్రామ మొత్తం జనాభాలో 18.18%గా ఉంది. టాటో గ్రామ సగటు లింగ నిష్పత్తి 1150. ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సగటు 938 కంటే ఎక్కువ. టాటో గ్రామంలో పిల్లల లింగ నిష్పత్తి 926, అరుణాచల్ ప్రదేశ్ సగటు 972 కంటే తక్కువ.

అరుణాచల్ ప్రదేశ్‌తో పోలిస్తే టాటో గ్రామం అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. 2011లో, అరుణాచల్ ప్రదేశ్‌లోని 65.38 %తో పోలిస్తే, టాటో గ్రామ ప్రజల అక్షరాస్యత రేటు 27.78% గా ఉంది. టాటో గ్రామంలో పురుషుల అక్షరాస్యత 36.79% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 20.31%గా ఉంది.భారత రాజ్యాంగం, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం, టాటో గ్రామం గ్రామ ప్రతినిధిగా ఎన్నికైన సర్పంచ్ (గ్రామ అధిపతి)చే నిర్వహించబడుతుంది.[1][2]

జిల్లా ప్రధాన కార్యాలయం టాటో గ్రామానికి ఈ దిగువ వివిరించిన గ్రాలు సమీపంలో ఉన్నాయి.[2]

  • రోడ్ లేబర్ క్యాంప్
  • దిగువ హేయో
  • వి బి క్యాంపు
  • పాబుయింగ్
  • క్వింగ్
  •  పెనే
  • కేయింగ్ హెచ్ క్యూ
  • కేయింగ్ గ్రామం
  • ట్యూయింగ్ గ్రామం
  • సిరమ్