తెలుపు


Contributors to Wikimedia projects

Article Images

తెలుపు ఒక స్వచ్ఛమైన రంగు. ఇది అన్ని రంగుల సమ్మేళనం.[1] స్వచ్ఛమైన తెల్లని పదార్ధాలు పంచదార, మంచు, ప్రత్తి, పాలు మొదలైనవి.

తెల్లని హంసల జంట.

న్యూటన్ కంటే ముందు చాలా మంది శాస్త్రవేత్తలు తెల్లని కాంతి ప్రాథమిక రంగు అనుకొనేవారు. న్యూటన్ తెల్లని కాంతిని ఒక ప్రిజమ్ ద్వారా తెల్లని కాంతిని ప్రసరింపజేసి సప్తవర్ణాలను విశ్లేషించాడు. ఒక్కొక్క రంగు కాంతి కిరణాలలో ఎటువంటి మార్పులేదు. ఈ ప్రయోగంతో తెల్లని వివిధ వర్ణాల మిశ్రమమని నిరూపించాడు.

తెల్లని అంబారీ ఏనుగు: 19శతాబ్దపు థాయి చిత్రకళ.
  • భారతీయ సాంప్రదాయం ప్రకారం తెలుపు పవిత్రత, శాంతి, స్వచ్ఛతకు సంకేతం.
  • భారతీయ వివాహంలో పెళ్ళికూతురు తెల్లని చీర కట్టుకొని, తెల్లని మల్లెపూలు జడలో తురుముకొని, తెల్లని పాలగ్లాసుతో మొదటి రాత్రి పెళ్ళికొడుకును చేరుతుంది.
  • క్రిష్టియన్ వివాహంలో పెళ్ళికూతురు దుస్తులు కూడా స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటాయి.
  • ఇంద్రుని వాహనం ఐరావతం తెల్లని ఏనుగు.
అమెరికా అధ్యక్షుని నివాసం. (శ్వేత సౌధం)
  • తెల్ల భవనం: అమెరికా రాష్ట్రపతి నివాసం.
  • శ్వేత పత్రం అనగా బాగా క్లిష్టమైన సమస్య మీద అవగాహన కోసం ప్రభుత్వం విడుదల చేయు పత్రం.
  • తెల్లని రిబ్బను మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు సంకేతం.

Look up తెలుపు in Wiktionary, the free dictionary.