దేవదత్తుడు


Contributors to Wikimedia projects

Article Images

దేవదత్తుడు సుప్పబుద్ధ మహారాజ, ఆయన భార్య పామిత యొక్క పుత్రుడు.ఇతడు సిద్ధార్థ గౌతమునికి మేన బావ, యశోధరకు అన్న అవుతాడు. చిన్ననాటి నుండి అన్ని విషయాలలో సిద్ధార్థునికి ఎదురుతిరుగుతూ,ఆటంకాలు కలిగించేవాడు.

సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా అవతరించిన పిమ్మట దేవదత్తుడు కొంత కాలం శాక్య రాజ్యాన్ని చూసుకుంటాడు, సొంత చెల్లెలైన సిద్ధార్ధుని భార్యయగు యశోధరను మానసికంగా వేదిస్తాడు,కామిస్తాడు.

కొంతకాలం తరువాత బుద్ధుడు తిరిగి రాజ్యానికి రాగ ఆనందునితో పాటు దేవదత్తుడు కూడా బౌద్ధ సంఘములో చేరతాడు.మొదట్లో సక్రమంగా ఉంటూ అందరి మెప్పులు పొందినా కూడా కుట్ర, కల్మషం,కపటం కలిగిన దేవదత్తుడు బుద్ధతత్వాన్ని పొందలేడు, కానీ అత్యంత కాఠిన్యమైన శిక్షణలు చేసి అతీంద్రియ శక్తులను పొందుతాడు.

ఒకానొక దినం బుద్ధుని వద్దకు వెళ్లి తనను సంఘాధ్యక్షునిగా ప్రకటించమని అడుగుతాడు, అతని కుటిల ఆలోచన కనిపెట్టి బుద్ధుడు ఒప్పుకోడు.దానికి ఆగ్రహించిన దేవదత్తుడు వివిధ రకాల కుట్రలు పన్ని బుద్ధుణ్ణి అంతమొందించాలని విఫలయత్నం చేస్తాడు.బిక్షుసంఘాన్ని కొన్ని కారణాలు చూపి విభజిస్తాడు, కానీ సారిపుత్త, మోగ్గల్లాన బిక్క్షువులు దేవదత్తుని పంచన చేరిన బిక్కశువులకు బుద్ధ తత్వాన్ని,ధర్మాన్ని బోధించి తిరిగి బుద్ధ సంఘంవైపుకు వారిని నడుపుతారు.

ఇలా ఎన్నో చెడ్డ కర్మలకు పాల్పడిన దేవదత్తుడు ఆ కర్మలకు అనుగుణంగా చాలా దీన స్థితిలో మృత్యువుతో పోరాడి, బుద్ధుణ్ణి శరణు గోరుతూ మరణిస్తాడు.కానీ అతను చేసిన కొన్ని మంచి కర్మల ఫలితంగాను మరొక పుట్టుకలో "అత్థిస్సర"నామముతో పచ్చేక బుద్ధునిగా పుట్టి నిర్వాణం పొందుతాడని ప్రతీతి.