దేవేంద్ర ఫడ్నవిస్
Contributors to Wikimedia projects
Article Imagesదేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్రకు చెందిన రాజకీయనాయకుడు. 1970లో నాగ్‌పూర్‌లో జన్మించిన ఫడ్నవిస్ అంచెలంచెలుగా ఎదుగుతూ 2014 మహారాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ డిప్యూటీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవిస్ ను ప్రకటించబడి [1][2] 2014 అక్టోబరు 31న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019, నవంబర్ 23వ న రెండవ సారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడు. .
దేవేంద్ర గంగాధర్ ఫడ్నవిస్ | |||
Assembly Member | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 30 జూన్ 2022 | |||
Assembly Member | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు |
|||
---|---|---|---|
జననం | 1970 జూలై 22 (వయసు 54) నాగ్‌పూర్ | ||
జాతీయత | India | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | అమృత ఫడ్నవిస్ | ||
సంతానం | దివిజ ఫడ్నవిస్ (కుమార్తె) | ||
మతం | హిందూ |
రాజకీయ నేపధ్యము
విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఫడ్నవిస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో, భారతీయ జనతాపార్టీ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో చురుకుగా పాల్గొన్నారు. 21 ఏళ్ల వయస్సులోనే నాగపూర్ నగరపాలక సంస్థ కార్పోరేటరుగా ఎన్నికై, 1997లో నాగపూర్ మేయర్ పదవి చేపట్టారు. దేశంలో చిన్న వయస్సులోనే మేయర్ అయిన వాళ్లలో ఫడ్నవిస్ ఒకరు.[3] ఆ తర్వాత 3 సార్లు శాసనసభకు ఎన్నిక కావడమే కాకుండా మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని కూడా నిర్వహించారు. 2014 అక్టోబరు 31న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి పొంది మహారాష్ట్ర తొలి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగ అవతరించారు.
పురస్కారములు
- కామన్వెల్త్ పార్లమెంటు అసోసియేషన్ ద్వారా 2002-03 సంవత్సరానికి గానూ ఉత్తమ పార్లమెంటు సభ్యుని పురస్కారము.
- జాతీయ అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో ఉత్తమ ఉపన్యాసకుడిగా పురస్కారము.
- రోటరీ క్లబ్ Most Challenging Youth ప్రాంతీయ పురస్కారము.
- ముక్త్‌చంద్, పూనా, ద్వారా ప్రధానం చేయబడిన ప్రమోద్ మహాజన్ ఉత్తమ పార్లమెంటు సభ్యుని పురస్కారము.
- నాసిక్ లోని పృణవద్ పరివార్ ద్వారా ప్రధానం చేయబడిన రాజ్‌యోగి నేతా పురస్కారము.
- హిందూ న్యాయచట్టం లోని ప్రావీణ్యతకు గానూ ప్రధానం చేయబడిన బోస్ బహుమతి.
మూలాలు
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 29-10-2014
బయటి లంకెలు
- https://web.archive.org/web/20160314023527/http://afternoondc.in/city-news/new-state-bjp-president-devendra-fadnavis-faces-daunting-task/article_80121
- http://transformingindians.org/launch-in-nagpur-on-20th-october-2012-by-mla-devendra-fadnavis/[permanent dead link]
- http://timesofindia.indiatimes.com/city/nagpur/Save-Nag-River-campaign-NADI-it-is/articleshow/19522250.cms