నల్లగారి రామచంద్ర


Contributors to Wikimedia projects

Article Images

నల్లగారి రామచంద్ర

నల్లగారి రామచంద్ర కథా రచయిత, కవి, నవల, నాటక రచయిత. గ్రామీణ నేపథ్యమన్నా, కర్షకుల జీవితాలన్నా ఆయనకు ఎంతో ఇష్టం. తన రచనలలో కర్షకుల కష్టాలను, గ్రామీణ నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు రచించాడు.

అతను వై.ఎస్.ఆర్ జిల్లాలోని రామిరెడ్డిపల్లెలో 1939 నవంబరు 12న బాలమ్మ, గంగిరెడ్డి దంపతులకు జన్మించాడు. ప్రొద్దుటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రీడర్‌గా ఉద్యోగంలో చేరిన అతను వివిధ ప్రాంతాల్లో పనిచేసి 1997లో పదవీ విరమణ చేశాడు. ఆ తర్వాత రచనా రంగంవైపు దృష్టి సారించి కథారచయితగా మంచి గుర్తింపు పొందారు. యువకవులను, రచయితలను ప్రోత్సహించడానికి సాహితీ మిత్రమండలిని స్థాపించి అనేక కవి సమ్మేళనాలు, సాహితీ కార్యక్రమాలు నిర్వహించాడు. అతనికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు[1].

అతనికి సాహిత్యంలోని దాదాపు అన్ని ప్రక్రియల్లో ప్రావీణ్యం ఉంది. రేనాడు, నూర్జహాన్‌ (చారిత్రక నవల)[2], మాపల్లె ముచ్చట్లు, మాసీమ కథలు పుస్తకాలు ఈయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. పారిజాతాపహరణం, శ్రీకృష్ణమాయ అనే పౌరాణిక పద్యనాటకాలు సైతం రాశాడు. 25కు పైగా పుస్తకాలు వెలువరించాడు. అతని సాహతీకృషికి గాను అనేక బిరుదులు, బహుమతులు వరించాయి.

అతను 2019, జూన్ 30న ప్రొద్దుటూరు నాగేంద్రనగర్‌లోని వారి స్వగృహంలో మరణించాడు.