నీలము


Contributors to Wikimedia projects

Article Images

నీలము (Blue e) ఒక విధమైన రంగు. 440-490 నానోమీటర్ల మధ్య తరంగదైర్ఘ్యం కలిగిన కాంతి తరంగాలు కంటికి తగిలినపుడు అది "నీలిరంగు" అనే భావన కలుగుతుంది. HSV Colour Wheelలో నీలం రంగుకు కాంప్లిమెంటరీ కలర్ పసుపు; అనగా ఎరుపు, ఆకుపచ్చ రంగుల కాంతులు సమపాళ్ళలో ఉంటే వచ్చే రంగు అన్నమాట. అయితే RYB కలర్ మోడల్‌లో నీలం రంగుకు కాంప్లిమెంటరీ కలర్ నారింజ రంగు. ఇది మున్సెల్ రంగుల చక్రం విధానంలో.[1] నీలిరంగులో వివిధ రకాలున్నాయి.

నీలిరంగులో వైవిధ్యాలు
ఒక 422.99-కారట్ల బరువున్నపెద్ద నీలమణి.

ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది? ...

మార్చు

 
విమానం నుండి చూసినప్పుడు కనిపించే నీలం రంగు ఆకాశం.

ఈ రకం రంగు ప్రశ్నలన్నిటికి సమాధానం అర్ధం కావాలంటే కాంతి ‘చెదరటం,’ అనే భావం అర్ధం కావాలి. గాలిలో అనేకమైన అణువులు (‘మోలిక్యూల్స్’), రేణువులు (‘పార్టికిల్స్') ఉంటాయి. ఉదాహరణకి ఆమ్లజని, నత్రజని అణువులు గాలిలో విస్తారంగా ఉంటాయి. అలాగే దుమ్ము రేణువులు, నీటి ఆవిరి అణువులు కూడ ఉంటాయి. కాంతి కిరణాలు సూర్యుడి దగ్గనుండి మనకి చేరుకునేలోగా ఈ గాలిలో ప్రయాణం చేస్తాయి. సూర్య కిరణాలు ఈ రేణువులని ఢీ కొన్నప్పుడు ఆ కాంతి చెల్లా చెదరవుతుంది. సూర్యుడి వెలుగు మన కంటికి తెల్లగా కనబడ్డప్పటికీ, అందులో ఎన్నో రంగులు ఉంటాయని ఇంద్ర ధనుస్సు చూసిన వారందరికీ పరిచయమైన విషయమే. ఒకొక్క రంగు ఒకొక్క విధంగా చెదురుతుంది. ఉదాహరణకి ఇంద్రధనుస్సులో తరంగ దైర్ఘ్యం (wavelength) తక్కువ ఉన్న ఊదా (‘వయలెట్’) రంగు ఎక్కువ చెదురుతుంది, తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉన్న ఎరుపు (‘రెడ్’) తక్కువ చెదురుతుంది.

సూర్యుడు ఆకాశంలో కిందకి ఉన్నప్పుడు (అంటే ఉదయం, సాయంకాలం), సూర్య కిరణాలు భూమి వాతావరణంలో చాల దూరం ప్రయాణం చేస్తే కాని మన కంటిని చేరలేవు. కనుక కిరణాలలోని రంగులు విరజిమ్మబడటానికి సావకాశాలు ఎక్కువ. కనుక నీలి రంగు ఎక్కువగా ఇటు, అటూ చెదిరి పోతుంది, కాని ఎరుపు తక్కువ చెదురుతుంది కనుక తిన్నగా మన కంటిని చేరుకుంటుంది. అందుకనే సంధ్యా సమయంలో ఆకాశం ఎర్రగా కనిపిస్తుంది. పల్లెపట్టూళ్ళలో గోధూళి వేళ గాలిలోకి బాగా దుమ్ము రేగుతుంది. కనుక గోధూళి వేళ ఆకాశం ఎర్రగా ఉంటుంది. సూర్యుడు నడి నెత్తి మీద ఉన్నప్పుడు కిరణాలు మన వాతావరణంలో తక్కువ దూరం ప్రయాణం చేస్తాయి. కనుక సాయంత్రం కంటే ఎక్కువ నీలి రంగు మన కంటిని చేరుతుంది. అందుకని మధ్యాహ్నం ఆకాశం నీలిగా కనబడుతుంది.

మరి దూరపు కొండల నీలిమ సంగతి? ఉదాహరణకి ‘నీలగిరులు’ అంటేనే నీలి కొండలు కదా. చెట్లు దట్టంగా ఉన్న కొండల అసలు రంగు ఆకుపచ్చ. చెట్లు తక్కువగా ఉంటే బూడిద రంగు. వీటిని దూరం నుండి చూసినప్పుడు నీలి రంగు గాలి పొరలగుండా చూస్తాం. (“నీలి రంగు గాలి” అంటే? - నిజానికి గాలికి రంగు లేదు.) రోదసి రంగు నల్లటి నలుపు. మనం ఆకాశం వైపు చూసినప్పుడు ఆ నల్లటి నేపథ్యంలో గాలిని చూస్తున్నాం. గాలికి స్వతహగా రంగు లేకపోయినా గాలిలోని రేణువులు కాంతిని విరజిమ్మినప్పుడు ఆ గాలి మనకి నీలంగా అనిపిస్తుంది; కనిపించదు. అది మన భ్రాంతి.[2]

  1. "Glossary Term: Color wheel". Archived from the original on 2008-09-07. Retrieved 2009-01-02.
  2. వేమూరి వేంకటేశ్వరరావు రచననుండి