నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్


Contributors to Wikimedia projects

Article Images

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ [3] (ఆంగ్లం: National Institute of Technology, Warangal, NITW) దేశంలో ప్రారంభించబడిన రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలలో మొదటిది. దీనికి జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశాడు. 2002 నుండి, ఇది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా పిలవబడుతున్నది. ఇది వరంగల్లో జాతీయ రహదారి 202కు ఇరువైపుల, కాజీపేట రైలు కూడలికి 2 కిమీ దూరంలో ఉంది. దగ్గరి విమానాశ్రయం 140 కిమీల దూరంలోగల హైద్రాబాదులో ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ హైద్రాబాదు నుండి, పది నిముషాల కొకటి చొప్పున హనమకొండ వరకు బస్ సౌకర్యం ఉంది.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్

ఇతర పేర్లుs

NITW

పూర్వపు నామము

ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల, వరంగల్( రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ, వరంగల్)

ఆంగ్లంలో నినాదం

One Who Work, Shall Succeed (పనిచేసేవారు తప్పక విజయం సాధిస్తారు)
రకంPublic
స్థాపితం1959; 65 సంవత్సరాల క్రితం
ఎండోమెంట్US$30.21 Million[1]
డైరక్టరుఎన్ వి రమణారావు [2]

విద్యాసంబంధ సిబ్బంది

327[1]
విద్యార్థులు5782[1]
అండర్ గ్రాడ్యుయేట్లు3794[1]
పోస్టు గ్రాడ్యుయేట్లు1235[1]

డాక్టరేట్ విద్యార్థులు

753[1]
స్థానంఖాజీపేట, వరంగల్, తెలంగాణ, భారతదేశం
17°58′51″N 79°31′58″E / 17.9808°N 79.5328°E
కాంపస్పట్టణ
REC, వరంగల్, ప్రధాన భవనం

ఈ కాలేజిలో భిన్న సంస్కృతులకు చెందిన విద్యార్థులు చదువుకుంటారు. వీరికి నాణ్యమైన సాంకేతిక విద్య అందచేయటం ద్వారా ఉత్తేజితులైన, నేర్పరులైన ఇంజినీర్లుగా మారుస్తున్నది. మానవ విలువలు, తన్ను తాను తెలుసుకోవటం, సంఘంపట్ల సేవాభావనలతో పాటు, విద్య ద్వారా కొత్త అలోచనలతో, నవయుగ లక్ష్యాలవైపు పయనించేటట్లు చేస్తుంది.

 
NIT, వరంగల్ లోగో

1959లో సివిల్, ఎలెక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలతో మొదలయి, 1964లో కెమికల్, 1965లో మెటలర్జికల్, 1971లో ఎలెక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలతో, 2000లో మేనేజిమేంట్ శాఖలతో వర్ధిల్లింది., 2006 లో బయోటెక్నాలజీ కోర్సు మొదలయింది. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయానికి అనుభందంగా 1976 వరకు వున్న ఈ సంస్థ, కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోకి వచ్చింది. 2002 లో పేరు మార్చబడి, స్వతంత్ర విశ్వవిద్యాలయ హోదా స్థాయికి చేరింది. 2007లోదేశంలోని ముఖ్య సంస్థలలో ఒక్కటిగా గుర్తించబడి, ఐఐటి, ఐఐఎస్సీ, ఐఎస్ఐ సంస్థల స్థాయికి చేరింది. 2007లో డాటాక్వెస్ట్ పత్రిక సర్వే ప్రకారం, ఎన్ఐటిలలో మొదటిదిగా, దేశంలోని ఇంజీనీరింగు సంస్థలలో 8 వ స్థానంలో చేరింది. 2008 అక్టోబరులో స్వర్ణోత్సవాలు జరిగాయి.దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో బెస్ట్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌గా పేరు సంపాదించిన వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్ బీఏ) గుర్తింపుతో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది[4]

అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పి.హెచ్.డిస్థాయిలో ఇంజినీరింగ్, సైన్సు, గణితం, మేనేజిమెంటు విభాగాలలో విద్యాబోధన జరుగుతుంది.

విద్యార్ధుల ప్రవేశ వివరాలు

మార్చు

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సిబిఎస్ఇ వారి ఎఐఇఇఇ ప్రవేశ పరీక్షద్వారా, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ స్థాయి కోర్సులకు గేట్ ప్రవేశ పరీక్ష ద్వారా, ఇతర కోర్సులకు స్థానికి ప్రవేశపరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో సగం సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు, మిగతా సగం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కే

సాంకేతిక, సాంస్కృతిక విద్యార్థిసభలు

మార్చు

టెక్నోజియన్, స్ప్రింగ్‌స్ప్రీ పేర్లతో పిలవబడే ఈ సభలు, బాగా పేరుగాంచినవి. టెక్నోజియాన్ లో సాంకేతిక అంశాలతో కూడిన కార్యక్రమాలు ఉంటాయి. స్ప్రింగ్ స్ప్రీలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. వీటిలో పాల్గొనడానికి ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ఇంజనీరింగ్ కళాశాలల నుంచే కాక ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. టెక్నోజియన్ 2008 సభకి డా అబ్దుల్ కలాం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. స్ప్రింగ్‌స్ప్రీ ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ, దేశంలో ఒక పెద్ద సభగా మారింది. 50 కార్యక్రమాలతో, అందరిని అలరిస్తుంది.

ఈ కాలేజిలో చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. వీరు సభలు, సమావేశాలు జరుపుతూ, ఒకరునొకరు కలుసుకుంటూ, కాలేజీతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వుంటారు. రజత మిలనం (సిల్వర్ జుబ్లీ రీ యూనియన్) సభల వరంగల్లులో జరుగుతాయి. 2007లో జరిగిన సభలో అత్యధికంగా 175 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రభుత్వ, పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక, ఇంజనీరింగ్ రంగాల్లో స్థిరపడి నిట్ ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నారు. దేశంలోని అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్ సర్వీస్‌లకు ఎంపికయ్యూరు. సివిల్స్ టాపర్ అయిన ముత్యాలరాజు (ఐఏఎస్), పారిశ్రామిక రంగంలోకి వచ్చి ఆ తర్వాత రాజకీయ రంగానికి మళ్లిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నంధ్యాల ఎంపీ ఎస్‌పీవై రెడ్డి నిట్ పూర్వ విద్యార్థులే. సివిల్ సర్వీసుల్లో ఉన్న వి.అనిల్‌కుమార్ (ఐంఎస్), ఎన్‌వీ.సురేందర్‌బాబు (ఐపీఎస్), ఎం.మహేందర్‌రెడ్డి (ఐపీఎస్), తెన్నీటి కృష్ణ ప్రసాద్ (ఐపీఎస్) సైతం నిట్ పూర్వ విద్యార్థులే కావడం విశేషం. అంతేకాకుండా... కొందరు సామాజిక ఉద్యమాలపై ఆకర్షితులై పీపుల్స్‌వార్‌లో చేరారు. సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కేశవరావు నిట్ పూర్వ విద్యార్థే, న్‌కౌంటర్‌లో చనిపోయిన సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ నిట్‌లో విద్యనభ్యసించినవాడే. నిట్ డెరైక్టర్‌గా ఉన్న ప్రొఫెసర్ టి. శ్రీనివాసరావు రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలోనే మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో 1982లో బీటెక్ పూర్తి చేశారు. తాము చదువుకున్న బడిని మరిచిపోకుండా ఇప్పటికీ నిట్ అభివృద్ధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్వ విద్యార్థులు తమ వంతు సహకారం అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు[5]

ఈ కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందిన రేమాల రావు మైక్రోసాఫ్ట్ నియమించుకున్న మొట్టమొదటి భారతీయ ఉద్యోగి.[6][7]