పురాణం సుబ్రహ్మణ్య శర్మ


Contributors to Wikimedia projects

Article Images

పురాణం సుబ్రహ్మణ్య శర్మ

పత్రికా సంపాదకుడు, రచయిత

పురాణం సుబ్రహ్మణ్య శర్మ తెలుగు వారపత్రికలలో ఒక ఒరవడి సృష్టించిన మంచి సంపాదకులలో కొడవటిగంటి కుటుంబరావు సరసన నిలబడగల వారిలో ప్రథముడు. ఆంధ్రజ్యోతి వారపత్రికకు చాలా కాలం సంపాదకులుగా ఉండి ఆ పత్రిక ద్వారా మంచి సాహిత్యసేవ చేశారు. ఇల్లాలి ముచ్చట్లు అన్న శీర్షికను పురాణం సీత పేరుతో అనేక సంవత్సరాల పాటు నిర్వహించి అనేక విషయాల మీద (చైనా రాజకీయాల నుంచి-చీపురు కట్ట వరకు అని ఆట పట్టించేవారు అప్పుడు) రాజకీయ, సామాజిక, సాహిత్య, మానవ సంబంధ విషయాల గురించి వ్యంగం, హాస్యం మేళవించి వ్రాసేవారు.

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ
  • కల కానిది-1969
  • నీలి-1970 (ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రేడియోలో నాటికగా కూడా వచ్చింది)
  • ఇల్లాలి ముచ్చట్లు
  • జేబులో బొమ్మ-1972
  • చంద్రునికో నూలు పోగు-1976[1]
  • శివకాంత-1980
  • రంగుల రామచిలక-1981
  • మధురవాణి ఇంటర్వ్యూలు-1997
  • వంశీ-సినీ దర్శకుడు-నా దృష్టిలో పీఠికలు రాయడంలో అందెవేసిన దిట్ట శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు. ఏ పుస్తకానికి ఎలాంటి ముందుమాట, ఎటువంటి అంత్య వాక్యం రాయాలో-ఆ వ్యాకరణం తెలిసిన మహారచయిత, ఆయనలాగా ఎవరివల్లా రాయడం సాధ్యం కాదని నా నమ్మకం. (జయదేవ్ కార్టూన్లు సంపుటికి ఆప్త వాక్యం వ్రాస్తూ)
  1. సుబ్రహ్మణ్యశర్మ, పురాణం. చంద్రుడికో నూలిపోగు.