ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినం


Contributors to Wikimedia projects

Article Images

ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినం


ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినం, సముద్రం, నది, ఇతర నీటి వనరుల తీర ప్రాంతాలలో లోతు తక్కువ వుండి ఎక్కువ కాలం నీటి నిల్వ వుండే భూములను చిత్తడి నేలలు అంటారు. మంచి నీటి సరస్సులు, ఉప్పునీటి సరస్సులు, మడ అడవులున్న తీర ప్రాంతాలన్నీ చిత్తడి నేలలే. ఎగువ ప్రాంతంలోని భూములు అలల తాకిడికి దెబ్బ తినకుండా ఈ చిత్తడి నేలలు అడ్డు కట్ట వేస్తాయి. అరుదైన మొక్కలకు, పక్షులకు, జంతువులకు, చేపలు గుడ్లు పెట్టడానికి ఈ చిత్తడి నేలలు చాల అనుకూలం. సమీప నీటి నాణ్యతను పెంచడంలోను, కాలుష్య కారకాలను గ్రహించడంలోను ఈ చిత్తడి నేలలు ప్రాధాన్యతను పొషిస్తాయి. మానవుల తప్పిదాలతో పర్యా

వరణానికి చాల హాని జరుగుతున్నది. ఆ పరంపరలో ఈ చిత్తడి నేలలకు గూడా పెద్ద హాని జరుగు తున్నది. ప్రజలు వ్యవసాయ అవసరాలకు ఈ భూములను ఆక్రమించు కొని రసాయన ఎరువులకు వాడడం వల్లనూ ,  నివాస యోగ్యానికి ఈ నేలలను పూడ్చడంతోను, చిత్తడి నేలలు విధ్వంసానికి గురవుతున్నాయి. ప్రభుత్వం పరిశ్రమల కొరకు ఈ చిత్తడి నేలలను కేటాయిచడంలో అవి మరింత విధ్వంసానికి గురవుతున్నాయి. 

ఈ చిత్తడి నేలల పరిరక్షణకు 1971, ఫిబ్రవరి రెండవ తారీఖున ఇరాన్ లోని రామ్ సార్ లో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. అప్పుడు తీసుకున్న ఉమ్మడి ఒప్పందం పై 164 దేశాలు సంతకం చేశాయి. దానినే రామ్ సార్ ఒప్పందం అంటారు. చిత్తడి నేలల పరిరక్షణకు ఈ ఒప్పందంలో కొన్ని ప్రమాణాలను నిర్దేశించారు. భారతదేశం కూడా ఈ ఒప్పందం పై సంతకం చేసింది.