బావికొండ


Contributors to Wikimedia projects

Article Images

బావికొండ

విశాఖాపట్నం సమీపం లోని బౌద్ధ స్థలం

బావికొండ బౌద్ధ సముదాయం విశాఖపట్నం నుండి 16 కి.మీ. దూరంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 130 మీటర్ల ఎత్తుగల ఒక కొండపై ఉంది. కొండపై వర్షపు నీరు సేకరించి నిల్వఉంచటానికి అనేక బావులుండటంతో బావికొండ అని పేరు వచ్చింది. బావికొండ బౌద్ధారామం సా.శ.పూ. మూడవ శతాబ్దానికి చెందింది.

బావికొండ

బావికొండ బౌద్ధవిహారం

రక్షిత బౌద్ధ క్షేత్రం

బావికొండ is located in Visakhapatnam

బావికొండ

విశాఖపట్నం పటంలో బావికొండ స్థలం

Coordinates: 17°49′2″N 83°23′27″E / 17.81722°N 83.39083°E
దేశం India
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneIST
బావికొండ, ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల దొరికిన ముఖ్య క్షేత్రం

ఇక్కడ జరిగిన తవ్వకాలలో ఒక పెద్ద బౌద్ధ సముదాయం బయల్పడింది. ఒక మట్టి కలశంలో ఒక ఎముక ముక్క కూడా దొరికింది. ఇది బుద్ధుని భౌతిక అవశేషమని భావిస్తున్నారు. ఇంకా అనేక శాసనాలు, మట్టి పాత్రలు, ఫలకాలు, ఇటుకలు, నాణేలను కూడా రాష్ట్ర పురాతత్వశాఖ వారు సేకరించారు.[1] బావికొండకు సమీపంలో మరో రెండు బౌద్ధ సముదాయాలున్నాయి. అవి తొట్లకొండ, పావురాలకొండ.

  • విశాఖపట్నం సమీపంలోని బావికొండ స్థూపం

  • బావికొండ స్థూపాలు

  • బావికొండ వద్ద రాతి స్థూపం

  • బావికొండ బౌద్ధ సముదాయంలోని ఆయక స్థూపం

  • బావికొండ బౌద్ధ విహారము

  • బావికొండ వద్ద చైత్య గృహ స్తూపం శిథిలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-09. Retrieved 2012-11-26.

వికీమీడియా కామన్స్‌లో Bavikondaకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.