బిశ్రామ్‌గంజ్


Contributors to Wikimedia projects

Article Images

బిశ్రామ్‌గంజ్

త్రిపుర రాష్ట్రం, సిపాహీజాల జిల్లా ముఖ్య పట్టణం.

బిశ్రామ్‌గంజ్, త్రిపుర రాష్ట్రంలోని సిపాహీజాల జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఇది రాజధాని అగర్తలా నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2012, జనవరి నెలలో సిపాహీజాల జిల్లాగా ఏర్పడిన తరువాత ఇది జిల్లా ముఖ్య పట్టణంగా మార్చబడింది.

బిశ్రామ్‌గంజ్

పట్టణం

బిశ్రామ్‌గంజ్ is located in Tripura

బిశ్రామ్‌గంజ్

బిశ్రామ్‌గంజ్

భారతదేశంలోని త్రిపురలో ప్రాంతం ఉనికి

బిశ్రామ్‌గంజ్ is located in India

బిశ్రామ్‌గంజ్

బిశ్రామ్‌గంజ్

బిశ్రామ్‌గంజ్ (India)

Coordinates: 23°36′N 91°20′E / 23.60°N 91.34°E
దేశం భారతదేశం
రాష్ట్రంత్రిపుర
జిల్లాసిపాహీజాల
Elevation15 మీ (49 అ.)
భాషలు
 • అధికారికబెంగాళీ, కోక్బోరోక్, ఇంగ్లీష్
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్

799103

Vehicle registrationటిఆర్

పూర్వకాలంలో ఒక త్రిపుర రాజు పర్యటన కోసం వెళ్ళినప్పుడు అతను ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకునేవాడు. దాంతో, అతను ఈ స్థలానికి బిష్రామ్ గంజ్ అని పేరు పెట్టాడు. బిశ్రామ్ అంటే విశ్రాంతి అని, గంజ్ అంటే స్థలం అని అర్థం. ఈ ప్రాంతాన్ని త్రిపురి జాతికి చెందిన డెబ్బార్మా ప్రజలు ఆక్రమించారు. ప్రస్తుతం దేబ్బర్మాలను త్రిపుర ప్రధాన తెగగా పిలుస్తున్నారు.[1]

ఈ పట్టణం 23°36′N 91°20′E / 23.60°N 91.34°E అక్షాంశరేఖాల మధ్య ఉంది. ఇది సముద్రమట్టానికి 15 మీటర్లు (49 అడుగుల) ఎత్తులో ఉంది. అగర్తాలా నగరానికి తూర్పు వైపు 5 కి.మీ.ల దూరంలో, బిషాల్‌గర్ నుండి 22 కి.మీ.ల దూరంలో ఈ పట్టణం ఉంది. ఇందిరానగర్ (1 కి.మీ.), ఉత్తర చంపమురా (1 కి.మీ.), మరియంనగర్ (1 కి.మీ.), ఖైర్‌పూర్ (1 కి.మీ.), తూర్పు చంపమురా (1 కి.మీ.) మొదలైన గ్రామాలు బిశ్రామ్‌గంజ్ కు సమీపంలో ఉన్నాయి.[1]

ఇక్కడి ప్రజలు బెంగాళీ, కోక్బోరోక్, ఇంగ్లీష్ భాషలు మాట్లాడుతారు.

బిశ్రామ్‌గంజ్ పట్టణం ఖైర్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, పశ్చిమ త్రిపుర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

ఈ పట్టణం నుండి ఇతర ప్రాంతాలకు రోడ్డుమార్గం ఉంది. జోగేంద్రనగర్ రైల్వే స్టేషను, అగర్తలా రైల్వే స్టేషను బిశ్రామ్‌గంజ్‌కు చాలా దగ్గరలో ఉన్నాయి.[1]

  1. 1.0 1.1 1.2 "Bishramganj Village". www.onefivenine.com. Retrieved 2020-12-31.