విలియం గేస్కోయిన్


Contributors to Wikimedia projects

Article Images

విలియం గేస్కోయిన్

విలియం గేస్కోయిన్ (ఆంగ్లం : William Gascoigne) (1612 – జూలై 2 1644) ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, గణీత శాస్త్రవేత్త, శాస్త్ర సంబంధ పరికరాల తయారుచేసే శాస్త్రవేత్త. ఈయన మైక్రోమీటరును ఆవిష్కరించారు.

విలియం గేస్కోయిన్
William Gascoigne
జననంవిలియం గేస్కోయిన్
1612
మరణంజూలై 2 1644
ఇతర పేర్లువిలియం గేస్కోయిన్
ప్రసిద్ధిఖగోళ శాస్త్రవేత్త, గణీత శాస్త్రవేత్త
తండ్రిహెన్రీ గేస్కోయిన్
తల్లిమార్గరెట్ జేన్,

విలియం గేస్కోయిన్ 1612లో లీడ్స్‌లోని మిడిల్‌టన్‌లో జన్మించారు. మార్గరెట్ జేన్, హెన్రీ గేస్కోయిన్ ఆయన తల్లిదండ్రులు. గేస్కోయిన్ విద్యాభ్యాసం ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సాగింది.

శాస్త్ర జీవితం

విలియం గేస్కోయిన్ తొలిసారి మైక్రోమెట్రిక్ మర తయారుచేశారు. దాన్ని ఓ సెక్సటాంట్‌కి అమర్చి.. రెండు ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కచ్చితంగా కొలవగలిగారు. మర భ్రమణాంతరం, కటకం నాభ్యాంతరాల సహాయంతో చంద్రుడు, ఇతర గ్రహాల పరిమాణం నిక్కచ్చిగా లెక్కగట్టారు. గేస్కోయిన్ రూపొందించిన మైక్రోమీటర్ ఆ తర్వాత మరింత మెరుగైంది. అలా మెరుగుపరిచిన మైక్రోమీటరు మరతో శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ తోకచుక్క, ఇతర ఖగోళ వస్తువుల పరిమాణాలు కనుక్కున్నారు. జేన్ లారెంట్ పామర్ ఆ మైక్రోమీటరు మరను మరింతగా అభివృద్ధి చేసి, ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న స్క్రూగేజ్‌ని తయారుచేశారు. దీని సహాయంతోనే చిన్నవస్తువుల పరిమాణాలు లెక్కగట్టగలిగారు.

గేస్కోయిన్ 1642లో కింగ్ ఛార్లెస్ - 1 సైన్యంలో చేరారు. 1644 జూలై 2న యార్క్‌షైర్ మార్‌స్టన్ మూర్‌లో జరిగిన యుద్ధంలో మరణించారు.