శక్తి


Contributors to Wikimedia projects

Article Images

శక్తి

భౌతిక శాస్త్రంలో శక్తి (Energy) అంటే వస్తువు లేదా భౌతిక వ్యవస్థ కు బదిలీ చేయగలిగే పరిమాణాత్మక గుణం. దీనిని ఏదైనా పని చేసిన ఫలితంగా ఉష్ణం, కాంతి లాంటి రూపాలలో గుర్తించవచ్చు. శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, దానిని ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మాత్రమే మార్చగలము. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం శక్తిని జౌల్స్ లో కొలుస్తారు.

ఒక కదులుతున్న వస్తువు కలిగిఉండే గతి శక్తి, ఏదైనా ఒక ప్రత్యేక స్థానం వల్ల వస్తువు కలిగి ఉండే స్థితి శక్తి, సాగదీయబడిన ఘనపదార్థానికి ఉండే స్థితిస్థాపక శక్తి, రసాయనిక చర్యలకు సంబంధించిన రసాయనిక శక్తి, విద్యుదయస్కాంత వికిరణాలు మోసుకెళ్ళే వికిరణ శక్తి మొదలైనవి శక్తికి కొన్ని ఉదాహరణలు. జీవించే అన్ని జీవులు శక్తిని, స్వీకరిస్తూ, విడుదల చేస్తూ ఉంటాయి.