శివ్ శంకర్ - వికీపీడియా


Article Images

శివ్ శంకర్, 2004 ఆగస్టు 18న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానరులో మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు కాపుగంటి రాజేంద్ర దర్శకత్వం వహించాడు. ఇందులో మోహన్ బాబు, సౌందర్య, బ్రహానందం, ఆలీ తదితరులు నటించగా ఇళయరాజా సంగీతం సమకూర్చాడు. ఇది సౌందర్య నటించిన చివరి తెలుగు సినిమా. 2002లో వచ్చిన రోడ్ టు పెర్డిషన్ అనే హాలీవుడ్ సినిమా ప్రేరణతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు సమర్పించాడు.[1]

శివ్ శంకర్
దర్శకత్వంకాపుగంటి రాజేంద్ర
స్క్రీన్ ప్లేసత్యానంద్
నిర్మాతమోహన్ బాబు
తారాగణం
ఛాయాగ్రహణంవి. జయరాం
కూర్పుగౌతంరాజు
సంగీతంఇళయరాజా

నిర్మాణ
సంస్థ

విడుదల తేదీ

18 ఆగస్టు 2004

సినిమా నిడివి

139 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించాడు.[2] 2004, జూలై 31న అన్నపూర్ణ స్టూడియోలో ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ పెద్దలు హాజరయ్యారు.[3]

ఐడెల్ బ్రేన్ ఈ సినిమాకి 2.5/5 రేటింగ్ ఇచ్చింది. "ఈ సినిమాలో మోహన్ బాబు నటన, ఇళయరాజా సంగీతం బాగున్నాయి. పాత-కాల కథనం తీసుకోవడం ఈ సినిమాలోని లోపం అని పేర్కొన్నది".[1] ఫుల్ హైదరాబాద్ ఈ సినిమాకు మిశ్రమ రివ్యూ ఇచ్చింది.[4]