షాజహాన్ బాషా


Contributors to Wikimedia projects

Article Images

షాజహాన్ బాషా

మహమ్మద్ షాజహాన్ బాషా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో మదనపల్లె నుండి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1]

షాజహాన్ బాషా
షాజహాన్ బాషా

ఎమ్మెల్యే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు మహ్మద్ నవాజ్ బాషా
నియోజకవర్గం మదనపల్లె

ఎమ్మెల్యే

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2014
ముందు దొమ్మాలపాటి రమేష్
తరువాత డా.ఎం.ఎస్.దేశాయి తిప్పా రెడ్డి
నియోజకవర్గం మదనపల్లె

వ్యక్తిగత వివరాలు


జననం 1970
మదనపల్లె, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
తల్లిదండ్రులు మహమ్మద్ అక్బర్ సాహెబ్
జీవిత భాగస్వామి గుల్నాజ్ బేగం
బంధువులు మహ్మద్ నవాజ్ బాషా, మదనపల్లె మాజీ ఎమ్మెల్యే(తమ్ముడు)
సంతానం బుష్రా సమ్రీన్, జునైద్ అక్బరీ
నివాసం 16-243, సుబాష్ రోడ్, మదనపల్లె టౌన్, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

షాజహాన్ బాషా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా మదనపల్లె నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఆర్. కృష్ణ సాగర్ రెడ్డి పై 46,938 ఓట్లు మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆ పార్టీకి ఉనికి కోల్పోయింది. షాజహాన్ బాషా 2022 చివరిలో ఏఐసీసీలో సభ్యుడిగా నియమితుడయ్యాడు.[2][3]

షాజహాన్ బాషా 2023 మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మార్చి 10న నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు.[4] ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో మదనపల్లె నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి ఎస్. నిసార్ అహమద్ పై 5509 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5]